Homeఎక్స్ క్లూసివ్2018 లో హాట్ భామలు -హిట్ భామలు

2018 లో హాట్ భామలు -హిట్ భామలు

2018 Tollywood Hot and hit heroinesసమంత : రంగస్థలం చిత్రంలో అద్భుతంగా నటించి ప్రేక్షకుల నీరాజనాలను అందుకున్న భామ సమంత . పల్లటూరి అమ్మాయిగా అమాయకత్వాన్ని ప్రదర్శిస్తూనే అందాల ప్రదర్శన కూడా చేసి మెప్పించింది సమంత . అలాగే యు టర్న్ , అభిమన్యుడు చిత్రాలతో కూడా హిట్ కొట్టింది .

పాయల్ రాజ్ పుత్ : ఆర్ ఎక్స్ 100 చిత్రంలో శృంగార సన్నివేశాల్లో నటించి కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెట్టిన భామ పాయల్ రాజ్ పుత్ . శృంగార దేవతగా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిన పాయల్ ఒక్క సినిమాతోనే ఊహించని స్టార్ డం అందుకుంది .
కైరా అద్వానీ : మహేష్ బాబు సరసన భరత్ అనే నేను చిత్రంలో  నటించి మంచి మార్కులు కొట్టేసింది . నటన తోనే కాకుండా అందాల విందుతో కుర్రకారుని ఆకట్టుకుంటోంది కియారా . ఆ సినిమా ఇచ్చిన హిట్ తో మరిన్ని ఛాన్స్ లు కొట్టేసింది .
రష్మిక మందన్న : ఛలో చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన ఈ కన్నడ భామ గీత గోవిందం చిత్రంతో భారీ హిట్ కొట్టింది . ఒకే ఏడాదిలో రెండు హిట్స్ కొట్టి సంచలనం సృష్టించింది .
అదితిరావు హైదరీ : సమ్మోహనం చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన భామ అదితిరావు హైదరీ . తన నటనతో టాలీవుడ్ ని ఆకర్షించిన ఈ భామ ఈ ఏడాది అంతరిక్షం తో కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది అయితే అంతరిక్షం ఆశించిన స్థాయిలో ఆడలేదు .
నభా నటేష్ : నన్ను దోచుకుందువటే చిత్రంతో టాలీవుడ్ కి పరిచయం అయ్యింది నభా నటేష్ . గ్లామర్ తో పాటుగా నటనకు ఆస్కారం ఉన్న పాత్ర లభించడంతో తన ప్రతిభ నిరూపించుకుంది .

శోభిత ధూళిపాళ : హాట్ భామగా ముద్ర వేసుకున్న ఈ భామ గూఢచారి చిత్రంతో సక్సెస్ కొట్టింది . అయితే ఈ భామ నటన కంటే స్కిన్ షోతో ఎక్కువగా అలరిస్తోంది ప్రేక్షకులను .

- Advertisement -

English Title: 2018 Tollywood Hot and hit heroines

YouTube video
YouTube video
YouTube video
YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All