Homeటాప్ స్టోరీస్1950 నాటి కాలం కథతో మహేష్ సినిమా

1950 నాటి కాలం కథతో మహేష్ సినిమా

1950 backdrop story for mahesh and sukumarభారతదేశానికి స్వాతంత్యం వచ్చిన తొలినాళ్ళ నాటి పరిస్థితులను ఆధారంగా చేసుకొని కథ ని రూపొందించుకున్నాడట దర్శకులు సుకుమార్ . మహేష్ బాబు తో రూపొందించనున్న ఈ చిత్రం కోసం అప్పటి బ్యాక్ డ్రాప్ ని ఎంచుకోవడం సంచలనంగా మారింది . అయితే పూర్తికథ 1950 నాటిది కాదు సుమా ! మొత్తం కథ అప్పటిదే అయితే మహేష్ ఫ్యాన్స్ భయపడతారు కాబట్టి కేవలం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మాత్రం అప్పటిదని మిగతా కథ అంతా ఇప్పటిదే అని తెలుస్తోంది . ఇది బయటకు వినబడుతున్న కథనం ప్రకారం సుమా ! సుకుమార్ – మహేష్ బాబు ల కాంబినేషన్ లో ఇంతకుముందు వచ్చిన ”1 ” నేనొక్కడినే డిజాస్టర్ అయ్యింది దాంతో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు .

ఈ ఏడాది రంగస్థలం చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టాడు సుకుమార్ కాగా ఆ సినిమా తర్వాత మహేష్ కోసం కథ రెడీ చేసే పనిలో పడ్డాడు . ప్రస్తుతం మహేష్ మహర్షి అనే సినిమా చేస్తున్నాడు అది పూర్తికాగానే సుకుమార్ సినిమా చేయనున్నాడు . రంగస్థలం చిత్రం 1980 బ్యాక్ డ్రాప్ కాగా ఇది అంతకుమించిన కాలం కాబట్టి ఇంకా పెద్ద హిట్ అవుతుందేమో ! భరత్ అనే నేను వంటి సూపర్ హిట్ తర్వాత మహేష్ నుండి వస్తున్న చిత్రం మహర్షి కావడంతో ఆ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి .

- Advertisement -

English Title: 1950 backdrop story for mahesh and sukumar

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All