118 రివ్యూ

118 review
118 రివ్యూ

118 రివ్యూ :
నటీనటులు : నందమూరి కళ్యాణ్ రామ్ , షాలిని పాండే , నివేదా థామస్
సంగీతం : శేఖర్ చంద్ర
నిర్మాత : మహేష్ కోనేరు
దర్శకత్వం : కెవి గుహన్
రేటింగ్ : 2.5/ 5
రిలీజ్ డేట్ : మార్చి 1 , 2019

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా కెవి గుహన్ దర్శకత్వంలో మహేష్ కోనేరు నిర్మించిన చిత్రం ” 118” . టీజర్ , ట్రైలర్ లతో సినిమాపై ఆసక్తిని పెంచిన ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయ్యింది . మరి ఈ సినిమా ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? చూద్దామా ?

- Advertisement -

 

కథ :

జర్నలిస్ట్ గౌతమ్ ( కళ్యాణ్ రామ్ ) కు తరచుగా ఓ కల వస్తుంటుంది . ఆ కలలో ఆద్య ( నివేదా థామస్ ) అనే యువతిని ఎవరో చంపుతున్నట్లు తెలుసుకుంటాడు గౌతమ్ . తన కలలోకి వస్తున్న యువతి ఎవరు ? ఆమెని ఎందుకు చంపాలని చూస్తున్నారు అని తెలుసుకోవాలను కుంటాడు గౌతమ్ . అయితే తాను తెలుసుకునే క్రమంలో తనది కల కాదని నిజంగానే ఆద్య ఇబ్బందుల్లో ఉందని , ఆమె వెనుక ఉన్న మిస్టరీ ఏంటో తెలుసుకోవాలని ప్రయత్నిస్తాడు . ఆ క్రమంలో గౌతమ్ ని చంపాలనుకుంటారు విరోధులు . అసలు ఆద్య ని చంపింది ఎవరు ? తనకు మాత్రమే ఆ కల ఎందుకు వస్తోంది ? చివరకు గౌతమ్ ఆ కల వెనుక ఉన్న మిస్టరీ ని ఛేదించాడా ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

 

హైలెట్స్ :

కళ్యాణ్ రామ్

నివేదా థామస్

శేఖర్ చంద్ర నేపథ్య సంగీతం

విజువల్స్

నిర్మాణ విలువలు

డైరెక్షన్

 

డ్రా బ్యాక్స్ :

అక్కడక్కడా సాగే స్లో నెరేషన్

 

నటీనటుల ప్రతిభ :

జర్నలిస్ట్ గౌతమ్ పాత్రలో నందమూరి కళ్యాణ్ రామ్ అద్భుతంగా తన పాత్రని పోషించాడు . కెరీర్ మొదటి నుండి విభిన్న తరహా చిత్రాలకు ప్రాధాన్యం ఇస్తున్న కళ్యాణ్ రామ్ మరోసారి తన అభిరుచి ఏంటో ఈ సినిమా ద్వారా నిరూపించుకున్నాడు . రొటీన్ కి భిన్నంగా కళ్యాణ్ రామ్ చేసిన గౌతమ్  పాత్ర తన కెరీర్ లో నిలిచిపోతుంది అనడంలో సందేహం లేదు . నివేదా థామస్ పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ కథలో కీలకమైన మలుపు తిప్పే పాత్ర కావడంతో తన పాత్రని సమర్థవంతంగా పోషించి మెప్పించింది . షాలిని పాండే తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. ఇక మిగిలిన పాత్రల్లో హరితేజ , నాజర్ , ప్రభాస్ శ్రీను తదితరులు తమతమ పాత్రలకు న్యాయం చేసారు .

 

సాంకేతిక వర్గం :

దర్శకుడు కెవి గుహన్ ఈ సినిమాకు హైలెట్ గా నిలిచాడు . ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు కెమెరామెన్ గా పనిచేసిన అనుభవంతో తెలుగులో తొలిసారిగా దర్శకత్వం వహించాడు . సస్పెన్స్ ని చివరి వరకు లాగించి శభాష్ అనిపించాడు . ఈ సినిమాని నడిపించిన తీరుకి తప్పకుండా గుహన్ ని అభినందించాల్సిందే . విజువల్స్ గా బాగుంది అలాగే శేఖర్ చంద్ర నేపథ్య సంగీతం కూడా ఈ సినిమాకు మరో హైలెట్ గా నిలిచింది . మహేష్ కోనేరు నిర్మాణ విలువలు బాగున్నాయి .

 

ఓవరాల్ గా :

నిజంగానే విభిన్న తరహా చిత్రం ఈ 118 .

English Title: 118 Movie review rating

Click here for English Review

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All