Homeటాప్ స్టోరీస్అమెరికాలో 1000 స్క్రీన్స్ లో RRR..!

అమెరికాలో 1000 స్క్రీన్స్ లో RRR..!

1000 Screens for RRR Movie in US NTR Ram Charan Rajamouli
  

రాజమౌళి సినిమా అంటే ప్రమోషన్స్ ఓ రేంజ్ లో ఉంటాయి. ఆ ప్రమోషన్స్ కు తగినట్టుగానే రిలీజ్ ప్లాన్ ఉంటుంది. ప్రస్తుతం రాజమౌళి డైరక్షన్ లో రాబోతున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా వరల్డ్ వైడ్ గా భారీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను యూ.ఎస్ లో 1000 స్క్రీన్స్ లో రిలీజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆర్.ఆర్.ఆర్ సినిమాను యూ.ఎస్ లో సినీ మార్క్ చైన్ లింక్ తో రిలీజ్ చేస్తున్నారు. యూ.ఎస్ మొత్తం లో వారికి 350 మల్టీప్లెక్స్ లు ఉన్నాయి.

ఆర్.ఆర్.ఆర్ సినిమాను సినీ మార్క్ 288 మల్టీప్లెక్స్ లో రిలీజ్ చేస్తున్నట్టు టాక్. అంటే దానిలో ఉన్న అన్ని స్క్రీన్స్ కలిపితే దాదాపు 1000 స్క్రీన్స్ లో ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ అవుతుంది. ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి నటిస్తున్న సినిమా కాబట్టి అమెరికాలో ఆ మాత్రం రిలీజ్ ఉండాల్సిందే.

- Advertisement -

మరి యూ.ఎస్ లోనే ఆ రేంజ్ రిలీజ్ ఉంది అంటే తప్పకుండా ఇండియాలో ఆర్.ఆర్.ఆర్ ఓ రేంజ్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఇప్పటికే సంక్రాంతి రేసులో రాధే శ్యాం ఉండగా ముందుగా ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ భారీ స్థాయిలో ఉంటుందని తెలుస్తుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All