
పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ వకీల్ సాబ్ నేటికీ ఏడాది పూర్తి చేసుకుంది. హిందీ లో సూపర్ హిట్ అయినా పింక్ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని వేణు శ్రీ రామ్ డైరెక్ట్ చేయగా , దిల్ రాజు నిర్మించారు. పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రల్లో నటించగా అంజలి , నివేద , అనన్య , ప్రకాష్ రాజ్ మొదలగు వారు ఇతర పాత్రల్లో నటించారు. ఏప్రిల్ 09 , 2021 న భారీ ఎత్తున విడుదలై బ్లాక్ బస్టర్ అయ్యింది. ముఖ్యముగా ఈ చిత్రంలో పవన్ మేనరిజం , థమన్ మ్యూజిక్ , ప్రకాష్ రాజ్ – పవన్ కళ్యాణ్ ల మధ్య సాగిన కోర్ట్ సన్నివేశాలు అభిమానులను , ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
కేవలం వెండితెరపై మాత్రమే కాదు బుల్లితెర ఫై కూడా ఈ మూవీ విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఈ మూవీ తర్వాత పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ తో వచ్చాడు. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్లో హరిహర వీరమల్లు షూటింగ్ లో పవన్ కళ్యాణ్ బిజీ గా ఉన్నాడు.