Homeటాప్ స్టోరీస్సుకుమార్ కే ఎందుకు ఇలా జరుగుతోంది

సుకుమార్ కే ఎందుకు ఇలా జరుగుతోంది

రంగస్థలం చిత్రంతో నాన్ బాహుబలి రికార్డులను బద్దలు కొట్టాడు దర్శకులు సుకుమార్ . 80 నాటి కథతో సినిమా అంటే ఏమో అనుకున్నారు కానీ నాన్ బాహుబలి రికార్డులను బద్దలు కొట్టి వసూళ్ల పరంగా నెంబర్ 3 చిత్రంగా నిలిచింది రంగస్థలం . అయితే అంతటి బ్లాక్ బస్టర్ తర్వాత సుకుమార్ దర్శకుడిగా బిజీ అయిపోవాలి కానీ సీన్ రివర్స్ అయ్యింది . చేద్దామనుకున్న సినిమాలు ఒక్కొక్కటిగా క్యాన్సిల్ అవుతున్నాయి దాంతో షాక్ అవ్వడం సుకుమార్ వంతు అవుతోంది .

- Advertisement -

ఇప్పటికే మహేష్ బాబు తో ఓ సినిమా అనుకుంటే ఇక పట్టాలెక్కడమే తరువాయి అన్న సమయంలో మహేష్ బాబు సుకుమార్ కు హ్యాండ్ ఇచ్చాడు . ఆ బాధలో ఉన్న సుకుమార్ కు యంగ్ హీరో నాగశౌర్య రూపంలో మరో దెబ్బ తగిలింది . నాగశౌర్య హీరోగా సుకుమార్ తన శిష్యుడు దర్శకత్వంలో ఓ సినిమా చేయాలనీ అనుకున్నాడు , ప్రకటించారు కూడా కట్ చేస్తే ఇప్పుడు ఆ సినిమా కూడా క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది . దాంతో నాకే ఎందుకిలా అవుతోంది అంటూ బాధపడుతున్నాడట సుకుమార్ . ఇక అల్లు అర్జున్ సినిమా ఒకటి సుకుమార్ చేతిలో ఉంది కాకపోతే అది ఇప్పుడు కాదు వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుంది . అయితే అది కూడా సెట్ అవుతుందా ? లేక అది కూడా క్యాన్సిల్ అవుతుందా ? చూడాలి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All