Homeటాప్ స్టోరీస్రిలీజ్ సమస్యల్లో కేసీఆర్ బయోపిక్

రిలీజ్ సమస్యల్లో కేసీఆర్ బయోపిక్

టాలీవుడ్ లో బయోపిక్ ల పర్వం కొనసాగుతోంది , ఇప్పటికే పలు బయోపిక్ లు తెలుగు ప్రేక్షకులను అలరించగా మరికొన్ని డిజాస్టర్ లు అయ్యాయి . అయితే బయోపిక్ ల పర్వం మాత్రం కొనసాగుతూనే ఉంది . తాజాగా తెలంగాణ ఉద్యమ నాయకుడు కేసీఆర్ బయోపిక్ ” ఉద్యమ సింహం ” అనే చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకొని రిలీజ్ కి సిద్ధమైంది . అయితే రిలీజ్ చేయకుండా ఈ సినిమాకు కొంతమంది అడ్డం పడుతున్నారట దాంతో రిలీజ్ ఆగిపోయింది .

తెలంగాణలో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి . ఈ సమయంలో ఉద్యమ సింహం సినిమాని రిలీజ్ చేయడం వల్ల ఆంధ్రా ఓటర్లని ఇబ్బంది పెట్టడమే కాకుండా కేసీఆర్ కు ఓట్లు వచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి ఎన్నికల సమయంలో ఈ సినిమా రిలీజ్ చేయొద్దని చెప్పారట కొంతమంది దాంతో కేసీఆర్ బయోపిక్ ఉద్యమ సింహం రిలీజ్ ఆగిపోయింది . మరి ఎన్నికల తర్వాత నైనా రిలీజ్ అవుతుందా ? కేసీఆర్ బయోపిక్ కు ఆదరణ లభిస్తుందా ? చూడాలి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All