Homeటాప్ స్టోరీస్మహేష్ సృష్టించిన మరో సంచలనం

మహేష్ సృష్టించిన మరో సంచలనం

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మరో సంచలనం సృష్టించాడు . మహర్షి చిత్ర శాటిలైట్ హక్కులను జెమిని టివి 16. 8 కోట్లకు సొంతం చేసుకుంది . ఇప్పటికే డిజిటల్ రైట్స్ ని అమెజాన్ సంస్థ 11 కోట్లకు సొంతం చేసుకుంది . శాటిలైట్ , డిజిటల్ రైట్స్ రూపంలో మహర్షి చిత్రానికి 27. 8 కోట్లు వచ్చింది . మహేష్ కెరీర్ లోనే విభిన్న కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు . 
 
మహేష్ బాబు సరసన పూజా హెగ్డే నటిస్తుండగా అల్లరి నరేష్ కూడా ప్రధాన పాత్రలో నటిసున్నాడు . షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి కాగా రెండు పాటలు మాత్రం బ్యాలెన్స్ గా ఉంది . ఇక అన్నపూర్ణ స్టూడియోస్ లో ఒక పాటని మహేష్ – పూజా హెగ్డే లపై చిత్రీకరిస్తున్నారు ఆ పాట అయ్యాక దుబాయ్ వెళ్లనున్నారు మరో పాట కోసం . ఇక ఈ సినిమాని మే 9 న భారీ ఎత్తున రిలీజ్ చేయనున్నారు . 
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All