Homeఎక్స్ క్లూసివ్మరో వండర్ క్రియేట్ చేసిన మహేష్ బాబు

మరో వండర్ క్రియేట్ చేసిన మహేష్ బాబు

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా మహర్షి చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . కాగా మహర్షి హిందీ డబ్బింగ్ రైట్స్ కు కళ్ళు చెదిరే ఆఫర్ లభించింది . ఏకంగా 26 కోట్ల ధర పలకడం సంచలనం సృష్టిస్తోంది . ఇప్పటికే డిజిటల్ రైట్స్ రూపంలో 11 కోట్లు శాటిలైట్ రైట్స్ రూపంలో 16. 8 కోట్లు రాగా ఇపుడు హిందీ డబ్బింగ్ రైట్స్ రూపంలో 26 కోట్లు పలకడం సంచలనంగా మారింది .

- Advertisement -

కేవలం డబ్బింగ్ , డిజిటల్ , శాటిలైట్ రైట్స్ రూపంలోనే 53 కోట్ల బిజినెస్ కావడంతో మహేష్ చిత్రాల్లోనే వండర్ ఫుల్ బిజినెస్ జరిగిందంటూ సంతోషంగా ఉన్నారు ఆ చిత్ర బృందం . ఇక ఏరియాల వారీగా అవలీలగా 80కోట్ల నుండి వంద కోట్ల వరకు బిజినెస్ జరిగే అవకాశం ఉంది . మహేష్ సరసన పూజా హెగ్డే నటించగా వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక మహర్షి చిత్రాన్ని మే 9 న రిలీజ్ చేయనున్నారు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All