Homeఎక్స్ క్లూసివ్పవన్ కళ్యాణ్ భీమవరం లో గెలుస్తాడా ?

పవన్ కళ్యాణ్ భీమవరం లో గెలుస్తాడా ?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం లో అలాగే గాజువాక స్థానాల్లో రెండిట్లో కూడా పోటీ చేస్తున్నాడు . అయితే భీమవరంలో మొదట పవన్ కళ్యాణ్ గెలవడం ఖాయమని భావించారు కానీ ఎన్నికలు సమీపించిన కొద్దీ పవన్ కళ్యాణ్ గెలుపు నల్లేరు మీద నడక అన్నది మాయమైపోతుంది . ఎందుకంటే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండటంతో భీమవరం లోని అందరు హీరోల అభిమానులు పవన్ కే మా మద్దతు అని ప్రకటించారు .

- Advertisement -

కానీ నామినేషన్ లు పూర్తయ్యాక , ప్రచార పర్వం స్టార్ట్ అయ్యాక ఒక్కసారిగా సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి . మెగా ఫ్యాన్స్ తప్ప మిగతా హీరోల అభిమానులు అందరూ పవన్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు . నందమూరి అభిమానుల్లో సైతం కొంతమంది వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చేస్తుండగా కొంతమంది తెలుగుదేశం అభ్యర్ధికి మద్దతుగా నిలిచారు . పైగా పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీకి దిగడంతో రెండు చోట్ల గెలిస్తే తప్పకుండా ఓ స్థానంలో రాజీనామా చేయాల్సిందే కాబట్టి అది కూడా పవన్ కు ప్రతికూలమైంది . నామినేషన్ సమయంలో గెలుపు ఖాయం మెజారిటీ ఎంత అనే లెక్కలు ఉండేవి కానీ ఇప్పుడు మెజారిటీ పక్కకు గెలిస్తే చాలు దేవుడా ? అన్నట్లుగా ఉందట పరిస్థితి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All