Homeఎక్స్ క్లూసివ్ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన మహేష్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన మహేష్

మహేష్ బాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసాడు ఈరోజు . అదేంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కదా మరి మహేష్ బాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఏంటి అని అనుకుంటున్నారా ? చంద్రబాబు నాయుడు రియల్ సీఎం అయితే మహేష్ బాబు రీల్ సీఎం అదేనండీ భరత్ అనే నేను చిత్రంలో మహేష్ ముఖ్యమంత్రి గా నటిస్తున్నాడు . రాష్ట్రము విడిపోయి నాలుగేండ్లు అయ్యింది కానీ ఈ కథ అంతకుముందుదట . 
 
ఈరోజు గణతంత్ర దినోత్సవం కావడంతో మహేష్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న ఆడియో రిలీజ్ చేసారు . కొరటాల శివ అంటే కమర్షియల్ సినిమాకు సామాజిక సందేశాన్ని జోడించి తీసే దర్శకుడిగా పేరుంది . ఇప్పటివరకు చేసిన మూడు చిత్రాలు కూడా అదే కోవలో వచ్చాయి . ఇక ఇప్పుడేమో రాజకీయ కోణంలో తీస్తున్నాడు . ఎవరిని నొప్పిస్తాడో ఎవరిని మెప్పిస్తాడో చూడాలి . ఇక ఈ సినిమా ఏప్రిల్ లో రిలీజ్ కానుంది .
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All