
ప్రస్తుతం తెలంగాణలో థియేటర్లు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి. అయితే సమస్య అంతా ఆంధ్రప్రదేశ్ తోనే ఉంది. ఇక్కడి టికెట్ ధరలు మెయిన్ గా తెలుగు సినిమాను ఇబ్బంది పెడుతున్నాయి. అలాగే 50 శాతం ఆక్యుపెన్సీ ఉండడం కూడా నిర్మాతలను ఆలోజింపచేస్తోంది. దీంతో మీడియం బడ్జెట్ చిత్రాలు థియేటర్లలో విడుదలవ్వడానికి సముఖంగా లేదు.
ఇప్పటికే నారప్ప అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. టక్ జగదీష్ కూడా ఈ కోవలోకే వెళుతోంది. ప్రైమ్ లోనే ఈ సినిమా విడుదలవుతుంది. ఇక ఇప్పుడు గోపీచంద్ చిత్రం కూడా ఓటిటి బాట పడుతోంది. గోపీచంద్ నటించిన సీటిమార్ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. సంపత్ నంది ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు.
కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాను కూడా అమెజాన్ ప్రైమ్ డీసెంట్ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ లో ఈ చిత్రం డైరెక్ట్ ఓటిటి రిలీజ్ అవుతుంది.