Homeగాసిప్స్'సీటిమార్' కొట్టడానికి రెడీగా ఉన్నాము....

‘సీటిమార్’ కొట్టడానికి రెడీగా ఉన్నాము….

'సీటిమార్' కొట్టడానికి రెడీగా ఉన్నాము....
‘సీటిమార్’ కొట్టడానికి రెడీగా ఉన్నాము….

దర్శకుడు ‘హరీష్ శంకర్’ తీసిన సినిమా ‘వాల్మీకి’ నుండి ‘గడ్డలకొండ గణేష్’ గా మారింది. సినిమా విడుదల అవ్వడానికి 8 గంటల సమయంలో అభిప్రాయం బేధాలు వస్తున్నాయని చెప్పి మార్చేశారు. అయితే గడ్డలకొండ గణేష్ సినిమాలో ‘వరుణ్ తేజ్’ పవర్ఫుల్ క్యారక్టర్ చేస్తూ, సినిమాకి హీరోగా చేస్తాడు. ఆ సినిమా పేరు “సీటిమార్”.

ఆ సీటిమార్ సినిమా పేరు ఇప్పుడు మాచో స్టార్ ‘గోపీచంద్‘ తదుపరి సినిమాకి పనికివచ్చింది. సంపత్ నంది దర్శకత్వంలో, తమన్నా కథనాయికగా నిర్మస్తున్నారు ఈ సినిమాని ‘శ్రీనివాస చిత్తూరి’ గారు. ‘శ్రీనివాస సిల్వర్ స్క్రీన్’ బ్యానర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు.

- Advertisement -

అయితే మాస్ మసాలా సినిమాలని దూరంగా ఉంచిన గోపీచంద్ గారు, సంపత్ నంది తో కలిసి ఈ సారి మరలా మాస్ మాసాల ఫార్మటు లో తీస్తారంటా. అందుకే సంపత్ నంది గారు ఈ సారి సినిమాకి సీటిమార్ అని టైటిల్ కూడా రిజిస్ట్రేషన్ చేయయించారు అని, తొందరలో అధికారక ప్రకటన కూడా ఇస్తారంటా.

అయితే తమన్నా కూడా ఈ సినిమా మీద చాలా నమ్మకంగా ఉంది. గోపిచంద్ తో కలిసి మొదటి సారి నటిస్తుండగా, సంపత్ నంది తో తనకి ఇది మూడవ సినిమా. ఇదివరకే ‘రచ్చ’, ‘బెంగాల్ టైగర్’ సినిమాలలో తన అందాన్ని మరింత ఎక్కువగా చూపించారు అని, తన నటనకి తగ్గ, అభినయానికి తగ్గ పాత్ర ఇచ్చినందుకు ఈ సారి కూడా అలాంటి పాత్ర ఇచ్చినందుకు సినిమా గురించి ట్వీట్ కూడా చేసారు తమన్నా. ఈ సినిమా ముగ్గురికి మంచి పేరు తెచ్చిపెట్టాలి అని అందరూ అనుకుంటున్నారు.

చాణక్య సినిమా రిలీజ్ కి దగ్గర పడుతున్న తరుణంలో గోపిచంద్ ఇంకా ఒక సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అని తెలిసిందే కదా… మరి ఆ సినిమా విషయాలు బయటికి ఎప్పుడు వస్తాయో?

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All