Homeటాప్ స్టోరీస్అదరగొడుతున్న మాస్ మహారాజా రవితేజ "నేల టిక్కెట్టు" ట్రైలర్‌

అదరగొడుతున్న మాస్ మహారాజా రవితేజ “నేల టిక్కెట్టు” ట్రైలర్‌

Mass Maharaja's Nela Ticket ‌trailer ticks all boxes of a hit filmమాస్ మహారాజా రవితేజ సినిమా అంటేనే ఒక ఫుల్ మీల్స్ భోజనం. ఆయన సినిమాల్లో కామెడి ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, వెటకారపు డైలాగులు ఉంటాయి, మంచి ఎమోషన్లు ఉంటాయి. కుటుంబం మొత్తం సరదాగా కలిసి చూసే విధంగా ఆయన సినిమాలు ఉంటాయి.

ఇక కళ్యాణ్‌కృష్ణ తీసింది రెండు సినిమాలే అయినా తనకంటూ ఒక క్లాస్ ఇమేజ్ సంపాదించుకున్నాడు. మంచి కథా కథనంతో సరదాగా సాగిపోతూ ఫ్యామిలీ ఎమోషన్స్ బాగా పండించే సినిమాలు తీసిన ఆయన ఇప్పుడు రవితేజతో ‘నేల టికెట్టు’ తీస్తున్నారు.‌

- Advertisement -

మరి ఒక మాస్ హీరో ఒక క్లాస్ దర్శకుడు కలిసి పని చేస్తే ఎలా ఉంటుంది? చాలా ఆసక్తి రేపిన ఈ ప్రశ్నకి నిన్న విడుదల చేసిన సినిమా ట్రైలర్ సమాధానం చెప్పేసింది.

“ఫస్ట్ టైం లైఫ్ లో అమ్మ, అక్క, చెల్లి కాకుండా ఒక కొత్త రిలేషన్ కనిపిస్తుంది.”

“చుట్టూ జనం మధ్యలో మనం.. అది కదరా లైఫ్”

“ఎంత మంది కష్టాల్లో ఉన్నారో చూడరా.. కానీ సాయం చేసే వాడు ఒక్కడు లేడు”

“ముసలితనం అంటే చేతకానితనం కాదురా.. నిలువెత్తు అనుభవం”

లాంటి అద్భుతమైన అర్థవంతమైన కళ్యాణ్‌కృష్ణ మార్కు క్లాస్ డైలాగులు ఒక వైపు..

“నువ్వు రావటం కాదు.. నేనే వస్తున్నా.. ఇదే మూడ్ మెయిన్‌టైన్ చెయ్”

“నేల టిక్కెట్టు గాళ్ళతో పెట్టుకుంటే.. నేల నాకించేస్తారు”

లాంటి ఈలలు వేయించే రవితేజ మార్కు మాస్ డైలాగులు మరో వైపు.. చూస్తుంటేనే అర్థం అయిపోతుంది ఈ సినిమా క్లాస్, మాస్, ఫ్యామిలీ ఆడియన్స్ ప్రతీ ఒక్కరినీ దృష్టిలో పెట్టుకుని తీసారని.

మే 25న విడుదల అవ్వబోతున్న ఈ సినిమాని ఎస్ఆర్‌టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మించారు. రవితేజ సరసన మాళ్వికా శర్మ హీరోయిన్‌గా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో జగపతిబాబు, బ్రహ్మానందం, జయప్రకాశ్, రఘుబాబు, సుబ్బరాజు, ఆలి, పోసాని కృష్ణమురళి, అన్నపూర్ణమ్మ, ప్రియదర్శి, ప్రభాస్ శ్రీను, పృథ్వీ, సురేఖా వాణి, ప్రవీణ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఫిదా ఫేం శక్తికాంత్ కార్తీక్ సంగీతం, ఛోటా కే ప్రసాద్ కూర్పు, బ్రహ్మ కడలి కళ, ముఖేష్ ఛాయాగ్రహణం సమకూరుస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts