Wednesday, February 1, 2023
Homeటాప్ స్టోరీస్సమంత కొత్త సినిమా పేరేంటో తెలుసా

సమంత కొత్త సినిమా పేరేంటో తెలుసా

- Advertisement -

సమంత తాజాగా నాగచైతన్య తో కలిసి నటించిన ” మజిలీ ” చిత్రం రిలీజ్ కి సిద్ధం అవుతుండగా మరో కొత్త సినిమాని ప్రారంభించడానికి సిద్ధమైంది సమంత . తమిళంలో సంచలన విజయం సాధించిన ” 96 ” చిత్రాన్ని తెలుగులో దిల్ రాజు పునర్నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే . తమిళంలో విజయ్ సేతుపతి – త్రిష జంటగా నటించగా తెలుగులో సమంత – శర్వానంద్ జంటగా నటిస్తున్నారు . ఇక ఈ చిత్రానికి అనుకుంటున్న టైటిల్ ఏంటో తెలుసా …… ”జాను” .

ఉగాది సందర్బంగా జాను చిత్రానికి సంబందించిన మరిన్ని వివరాలను ప్రకటించనున్నారు దిల్ రాజు . ఇక ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తోంది తమిళ దర్శకుడు ప్రేమ్ కుమార్ . జాను చిత్రానికి మాతృక అయిన 96 చిత్రానికి దర్శకత్వం వహించిన ప్రేమ్ కుమార్ తెలుగులో కూడా దర్శకత్వం వహించనున్నాడు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts