
ప్రభాస్ నటించిన సాహో ఆగస్టు 30 న వస్తుండటంతో దానికి పోటీగా తన బందోబస్తు చిత్రాన్ని విడుదల చేయడానికి సిద్దమయ్యాడు సూర్య . అధికారికంగా డేట్ కూడా ప్రకటించారు ఆగస్టు 30 న బందోబస్త్ విడుదల అని కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సాహో కు పోటీగా వెళ్లడం కంటే మరో డేట్ చూసుకుంటేనే బెటర్ ని ఫిక్స్ అయ్యాడట దాంతో తన బందోబస్త్ ని సెప్టెంబర్ నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు సూర్య .
తెలుగులో బందోబస్త్ గా విడుదల అవుతోంది కానీ తమిళంలో మాత్రం ” కాప్పాన్ ” అనే పేరుతో విడుదల అవుతోంది . సాహో చిత్రంపై భారీ అంచనాలు ఉండటంతో తన సినిమాని వాయిదా వేసాడు సూర్య . దానికి తోడు గతకొంత కాలంగా సూర్య కు సరైన హిట్ లేదు ఇలాంటి సమయంలో పోటీ కి పోయి దెబ్బతినే కంటే తర్వాత విడుదల చేయడమే బెటర్ అని ఫిక్స్ అయ్యాడట . త్వరలోనే విడుదల తేదీ అనౌన్స్ చేయనున్నారు .