Homeటాప్ స్టోరీస్ప్రతి ఒక్కరికి థాంక్స్ చెపుతూ ఎన్టీఆర్ ప్రెస్ నోట్

ప్రతి ఒక్కరికి థాంక్స్ చెపుతూ ఎన్టీఆర్ ప్రెస్ నోట్

ntr revels rrr intervel scene
ntr revels rrr intervel scene

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫుల్ హ్యాపీ గా ఉన్నారు. రాజమౌళి డైరెక్షన్లో చరణ్ తో కలిసి ఆర్ఆర్ఆర్ మూవీ చేసాడు. ఈ మూవీ గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విజయం తో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇక ఎన్టీఆర్ నటన కు ప్రేక్షకులు ఫిదా అవుతున్న క్రమంలో ఎన్టీఆర్ ట్విట్టర్ ద్వారా చిత్ర యూనిట్ కు అభిమానులకు థాంక్స్ చెపుతూ నోట్ రిలీజ్ చేసారు.

RRR సినిమా విడుదలైనప్పటి నుంచి మీరు ప్రేమను కురిపిస్తున్నారు.. నా కెరీర్‌లో ఆర్ఆర్ఆర్ సినిమాను ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను.

- Advertisement -

నాలోని నటుడిని బయటకు తెచ్చిన జక్కన్నకు థ్యాంక్స్. నాలోని భిన్న నటుడుని, ఓ నీటిలా మార్చి బయటకు తీసుకొచ్చావ్.. నువ్విచ్చిన ప్రోత్సాహంతోనే నాలోని నటుడు బయటకు వచ్చాడు.. పాత్రకు ప్రాణం పోసేలా చేశావ్..

రామ్ చరణ్.. నా సోదరుడు.. అతను లేకుండా ఆర్ఆర్ఆర్‌లో నటించడాన్ని ఊహించలేను. అల్లూరి సీతారామరాజు పాత్రను నీకంటే బాగా ఎవ్వరూ పోషించలేరు.. ఆర్ఆర్ఆర్ సినిమానే కాదు.. నువ్ లేకపోతే భీమ్ కూడా లేడు.. అది అసంతృప్తిగానే ఉంటుంది.. నీటికి నిప్పులా తోడున్నావ్. థ్యాంక్స్.

అజయ్ దేవగణ్ సర్ లాంటి లెజెండరీ నటుడితో నటించడం గొప్పగా ఉంది.. ఆ క్షణాలు జీవితాంతం గుర్తుంటాయి.

ఆలియా అయితే.. అద్భుతమైన నటి. ఆమె పాత్రతో సినిమాకు మరింత బలం వచ్చింది. ఒలీవియా, అలిసన్ డూడీ, రే స్టీవెన్‌సన్ అద్భుతంగా నటించారు. ఇండియన్ సినిమాకు వెల్కమ్. మనం కలిసి పంచుకున్న క్షణాలను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను.

డీవీవీ దానయ్య గారు.. మీరు అద్భుతమైన నిర్మాత. ఆర్ఆర్ఆర్ లాంటి భారీ చిత్రాన్ని తీసి విజయవంతం చేశారు.

ఆర్ఆర్ఆర్ సినిమాకు లైఫ్ ఇచ్చిన కీరవాణి గారికి థ్యాంక్స్. మున్ముందు ఈ సినిమాలో సంగీతం నిరంతరం మార్మోగిపోతూనే ఉంటుంది. మీ సంగీతంతో సరిహద్దులన్నీ చెరిగిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా మీ సంగీతం అందరి చెవుల్లోకి చెరి, హృదయాలను తాకింది.

ఇండియన్ సినిమాలో అద్భుతమైన కథలను అందిస్తున్న విజయేంద్ర ప్రసాద్ గారికి ఎప్పుడూ రుణపడి ఉంటాను. మీరు రాసిన ఈ కథలు ఎప్పటికీ అందరి గుండెల్లో నిలిచిపోతాయి. రానున్న తరాలు వీటిని సెలెబ్రేట్ చేసుకుంటాయి.

సెంథిల్, సబు సర్, శ్రీనివాస్ మోహన్ సర్, శ్రీకర్ ప్రసాద్ సర్, సినిమాకు పని చేసిన సాంకేతిక నిపుణులందరికీ థ్యాంక్స్. ఇండియాలోనే బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా అయిన ఆర్ఆర్ఆర్ సినిమా మీ అందరూ లేకపోతే సాధ్యమయ్యేది కాదు.

కార్తికేయ.. నువ్వే అంతా దగ్గరుండి చేశావ్. సినిమా షూటింగ్ అంతా సవ్యంగా సాగేందుకు ఎంతో కష్టపడ్డావ్. కొమురం భీముడో పాటకు వాయిస్ ఇచ్చినందుకు నీకు రుణపడి ఉంటాను. నీ గాత్రంలో భీంలోని ఎమోషన్‌ను ఎలివేట్ చేశావ్.. ఎన్నో లక్షల మంది కళ్లు చెమర్చావ్.

నాటునాటు లాంటి మాస్ స్టెప్పులను కంపోజ్ చేసిన ప్రేమ్ రక్షిత్‌కు థ్యాంక్స్. ఆర్ఆర్ఆర్ సినిమాకు సపోర్ట్ ఇచ్చిన ఇండియన్ సినిమాకు సంబంధించిన ప్రతీ ఒక్కరికీ, ఇండస్ట్రీలోని స్నేహితులు, సన్నిహితులందరికీ థ్యాంక్స్. మనమంతా ఒక్కతాటిపైకి వచ్చిన మళ్లీ పూర్వవైభవాన్ని తీసుకొచ్చాం. మనం అంతా ఒక్కటిగా ఉంటే.. ఇండియన్ సినిమా నెంబర్ వన్ స్థానంలో ఉంటుంది.

ఇండియన్ మీడియాకు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాలి. మీరు సినిమాకు అందించిన సపోర్ట్, ప్రశంసలకు థ్యాంక్స్. ఆర్ఆర్ఆర్ సినిమా కేవలం ఇండియన్ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామానే కాకుండా.. వరల్డ్ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామాగా మార్చేశారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. నా అభిమానులకు మనస్పూర్తిగా థ్యాంక్స్ చెబుతున్నాను. మీరు చూపించే ప్రేమే నాకు ఇంధనం. అదే నాలోని నటుడిని బయటకు తీసుకొస్తుంది.. ఇకపై మిమ్మల్ని ఈ విధంగానే ఎంటర్టైన్ చేసేందుకు ప్రయత్నిస్తుంటాను’ అని ఎన్టీఆర్ థ్యాంక్స్ నోట్ పోస్ట్ చేశాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All