congress party ex mla mukesh goudమాజీ మంత్రి ముఖేష్ గౌడ్ ఆరోగ్యం విషమం

గోషామహల్ మాజీ ఎం ఎల్ ఏ , మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ ఆరోగ్యం విషమించింది . గతకొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ముఖేష్ గౌడ్ క్యాన్సర్ కు చికిత్స తీసుకుంటున్నాడు . అయితే ఇన్నాళ్లు గా చికిత్స తీసుకుంటున్నా ఆరోగ్యం మెరుగుపడకపోగా మరింతగా విషమించడంతో చేతులెత్తేశారు డాక్టర్లు . మెరుగైన వైద్యం అందించడానికి అన్ని రకాల ప్రయత్నాలు డాక్టర్లు చేసినప్పటికీ ఏవేవి ఫలించలేదు .

దాంతో చికిత్స నిలిపివేశారు . డాక్టర్లు చేస్తున్న ప్రయత్నానికి ముఖేష్ గౌడ్ శరీరం స్పందించడం లేదు దాంతో ఔషదాలు పనిచేయనప్పుడు చికిత్స అందించి లాభం లేదని నిర్ణయించారట . ముఖేష్ గౌడ్ ఆరోగ్యం విషమించింది అని తెలుసుకున్న అభిమానులు కార్యకర్తలు తీవ్ర అందోళన చెందుతున్నారు . కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం పనిచేసిన ముఖేష్ గౌడ్ శాసనసభ్యుడిగా , మంత్రిగా సేవలందించారు .