Homeటాప్ స్టోరీస్తొలి తెలుగు జాంబీ థ్రిల్ల‌ర్ `జీ`!

తొలి తెలుగు జాంబీ థ్రిల్ల‌ర్ `జీ`!

తొలి తెలుగు జాంబీ థ్రిల్ల‌ర్ `జీ`!
తొలి తెలుగు జాంబీ థ్రిల్ల‌ర్ `జీ`!

జాంబీ వైర‌స్ నేప‌థ్యంలో తెలుగులో వ‌స్తున్న తొలి జాంబీ థ్రిల్ల‌ర్ మూవీ `జీ`. సినిమాపై పాష‌న్‌తో మేకింగ్ ప‌ట్ల వున్న ఆస‌క్తితో సాఫ్ట్‌‌వేర్ ఎంప్లాయ్గా వున్న‌ దీపిక ఈ మూవీ ద్వారా ద‌ర్శ‌కురాలిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఆర్య‌న్ గౌర‌, దివ్య పాండే హీరోహీయిన్‌లుగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ మూవీ ఫ‌స్ట్ లుక్‌ని ఇటీవ‌ల స‌క్సెస్ ఫుల్ నిర్మాత రాజ్ కందుకూరి రిలీజ్ చేశారు. తాజా ఈ మూవీలోని `ది జాంబీ.. అంటే సాగే సాంగ్‌ని స‌క్సెస్ ఫుల్ చిత్రాల ద‌ర్శ‌కుడు త్రినాథ‌రావు న‌క్కిన రిలీజ్ చేశారు. ‌

కొత్త పాయింట్‌తో రూపొందుతున్న జాంబీ మూవీ ఇది. ద‌ర్శ‌కురాలిగా దీపిక ఈ మూవీతో మంచి విజ‌యాన్ని సాధించాల‌ని, అలాగే ఇందులో న‌టించిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌కు మంచి గుర్తింపు రావాల‌ని, కొత్త కాన్సెప్ట్‌తో వ‌స్తున్న ఈ చిత్రం అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకోవాలని ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు త్రినాథ‌రావు న‌క్కిన కోరుకున్నారు.

- Advertisement -

ఫ‌స్ట్ సాంగ్‌ని ద‌ర్శ‌కుడు త్రినాథ‌రావు న‌క్కిన రిలీజ్ చేయ‌డం ఆనందంగా వుంది. సినిమా బాగా వ‌చ్చింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. మేము ప‌డిన క‌ష్టానికి మించి ప్రేక్ష‌కులు ఈ చిత్రాన్ని ఆద‌రిస్తార‌ని భావిస్తున్నాను. ఆడియ‌న్స్ థ్రిల్ల‌య్యే ఎన్నో హార‌ర్ అంశాలు ఇందులో వున్నాయి. ఇయేట‌ర్స్‌లో విడుద‌లై మా సినిమా ఖ‌చ్చితంగా మంచి పేరు తెచ్చిపెడుతుంద‌ని భావిస్తున్నాన‌ని` ద‌ర్శ‌కురాలు దీపిక తెలిపారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All