
నిర్మాత ప్రశాంత్ తాత మాట్లాడుతూ.. సినిమా 90% చిత్రీకరణ పూర్తయింది. రామానాయుడు స్డూడియోస్ లో ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటొంది. జూలై ఫస్ట్ వీక్ లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామన్నారు..
డింపుల్ మాట్లాడుతూ.. హీరొయిన్ గా ఇది నా రెండో చిత్రం. సినిమా లొ నా పాత్రకు మంచి ప్రాదాన్యత ఉంటుందన్నారు.
కార్తీక్ ఆనంద్ మాట్లాడుతూ.. “యురేక” తో హీరొగా, దర్శకుడిగా పరిచయమవుతున్నాను. కథే ఈ చిత్రానికి బలం. ప్రతి పాత్రకు ప్రాదాన్యత ఉంటుంది.యూత్ పుల్ ఎంటర్ టైనింగ్ ఎంగెంజింగ్ థ్రిల్లర్ గా “యురేక” ఉంటుంది. కాలేజ్ ఫెస్ట్ నేపధ్యంలొ జరిగే కధ. టెక్నికల్ గా నాకు మంచి సపొర్ట్ లభించింది. అందరం యంగ్ టీమ్. ఔట్ పుట్ చాలా బాగా వస్తొందన్నారు.యురేక అంటే ఓ కొత్త విషయాన్ని కనిపెట్టడం ద్వారా వచ్చె హ్యాపినెస్. ఇంతకీ మా సినిమాలొ అదెంటనేది సస్పెన్స్. నిర్మాతలు రాజీ పడకుండా నిర్మిస్తున్నారన్నారు.
- Advertisement -