
యువ హీరో కార్తికేయ తన స్నేహితురాలు లోహిత పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. వరంగల్ ఎన్.ఐ.టీలో బీటెక్ టైం లోనే కార్తికేయ, లోహిత ఇద్దరు ప్రేమించుకున్నారు. ఆరెక్స్ 100 సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కార్తికేయ ఆ క్రేజ్ తో వరుస సినిమాలు చేస్తున్నాడు. హీరోగా మంచి బిజీ అవుతున్న టైం లో కార్తికేయ లోహితని పెళ్లి చేసుకున్నాడు.
ఆదివారం వీరి వివాహం జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి అతిథిగా వచ్చి వధువరులను ఆశీర్వదించారు. ఆరెక్స్ 100 హీరో పెళ్లిలో ఆ సినిమా డైరక్టర్ అజయ్ భూపతి, హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కూడా అటెండ్ అయ్యారు. వీరితో పాటు మరికొంతమంది సినీ ప్రముఖులు కూడా కార్తికేయ పెళ్లికి అటెండ్ అయ్యారు. ఇక సినిమాల విషయానికి వస్తే కార్తికేయ ఈమధ్యనే రాజా విక్రమార్క సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అజిత్ వాలిమై సినిమాలో కార్తికేయ విలన్ గా నటిస్తున్నాడు.