Homeటాప్ స్టోరీస్యోగిబాబు పెళ్ల‌యిపోయింది!

యోగిబాబు పెళ్ల‌యిపోయింది!

యోగిబాబు పెళ్ల‌యిపోయింది!
యోగిబాబు పెళ్ల‌యిపోయింది!

చిత్ర‌మైన గెట‌ప్‌తో క‌ర్లింగ్ హెయిర్‌తో ఆక‌ట్టుకునే త‌మిళ క‌మెడియ‌న్ వివాహం బుధ‌వారం జ‌రిగింది. త‌మిళ సినిమాల్లో ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో క్ష‌ణం తీరిక‌లేకుండా స్టార్ హీరోల‌కు మించి బిజీ బిజీగా గ‌డిపేస్తున్న క‌మెడియ‌న్ యోగిబాబు బుధ‌వారం చెన్నై తిరుట్టానిలోని మురుగ‌న్ టెంపుల‌క్ష‌ మంజు భార్గ‌విని వివాహం చేసుకున్నారు.

ఈ వేడుక‌కు యోగిబాబుకు అత్యంత స‌న్నిహితులైన స్నేహితులు, ఇరు కుటుంబాల స‌భ్యులు మాత్ర‌మే హాజ‌రైన‌ట్టు తెలిసింది. మార్చిలో త‌మిళ ఇండ‌స్ట్రీకిలోని స‌న్నిహితుల కోసం గ్రాండ్ రిసెస్ఫ‌న్ పార్టీని ఏర్పాటు చేసిన‌ట్టు చెబుతున్నారు. ఇటీవ‌ల ర‌జ‌నీ న‌టించిన `ద‌ర్బార్‌` చిత్రంలో యోగిబాబు న‌టించి న‌వ్వించిన విష‌యం తెలిసిందే. తాజాగా ఆయ‌న న‌టిస్తున్న `కాక్‌టైల్‌` సినిమాకు సంబంధించిన ఓ పోస్ట‌ర్‌ని ఇటీవ‌లే రిలీజ్ చేశారు.

- Advertisement -

ఆ ఫొటోలో యోగిబాబు లార్డ్ మురుగ‌న్‌గా క‌నిపించారు, ఇదే పెద్ద దుమారానికి దారితీసింది. మురుగ‌న్‌ని కించ‌ప‌రిచార‌ని, హిందూ మ‌క్క‌ల్ క‌చ్చి యోగిబాబుపై కేస్ ఫైల్ చేయించింది. దీనిపై యోగాబాబు మాత్రం ఇంత వ‌ర‌కు స్పందించ‌లేదు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All