Homeగాసిప్స్వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంలో మెయిన్ ట్విస్ట్ అదేనట

వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంలో మెయిన్ ట్విస్ట్ అదేనట

వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంలో మెయిన్ ట్విస్ట్ అదేనట
వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంలో మెయిన్ ట్విస్ట్ అదేనట

విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా వరల్డ్ ఫేమస్ లవర్. ఈ ‘రౌడీ’ హీరో నటించిన సినిమాలు ఈ మధ్య వరసగా ఆడలేదు. ఎన్నో అంచనాలు పెట్టుకున్న నోటా, డియర్ కామ్రేడ్ చిత్రాలు నిరాశపర్చాయి. ముఖ్యంగా డియర్ కామ్రేడ్ కచ్చితంగా హిట్ అవుతుందని ఆశించాడు విజయ్. ఈ చిత్రం తనకెంతో దగ్గరైందని చెప్పాడు. అయితే ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. అయితే ఈ ప్లాపులు విజయ్ దేవరకొండ క్రేజ్ ను ఏ మాత్రం ఎఫెక్ట్ చేయలేదు. ప్రస్తుతం ఈ హీరో చేతిలో నాలుగైదు ప్రాజెక్టులు సెట్ అయ్యి షూటింగ్ కు వెళ్ళడానికి సిద్ధమవుతున్నాయి. తన లేటెస్ట్ సినిమా వరల్డ్ ఫేమస్ లవర్ షూటింగ్ చివరి దశకు చేరుకోగా, ఫిబ్రవరి 14న విడుదలకు సిద్ధమైన విషయం తెల్సిందే. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్ర టీజర్ ఇటీవలే విడుదలైంది. కేవలం 2 రోజుల్లోనే దాదాపు 10 మిలియన్ వ్యూస్ తో సెకండ్ టయిర్ హీరోల్లో బెంచ్ మార్క్ ను సెట్ చేసింది.

వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంలో మొత్తం నలుగురు హీరోయిన్లు ఉన్నారు. రాశి ఖన్నా, క్యాథెరిన్, ఇజబెల్, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. టీజర్ చూస్తే కథ ఏంటనేది క్లారిటీ రాలేదు. నలుగురు హీరోయిన్లకు నాలుగు డిఫరెంట్ బ్యాక్ డ్రాప్స్ ఉన్నాయి. దీంతో వరల్డ్ ఫేమస్ లవర్ మెయిన్ థీమ్ ఏంటి అనేది చాలా ఆసక్తికరంగా మారింది. అయితే ఫిలిం సర్కిల్స్ ఈ చిత్ర కథ గురించి రకరకాల కథనాలు ప్రచారంలోకి వచ్చాయి కానీ ప్రధానంగా టీజర్ తో పోల్చి చూసుకుంటే ఒక పాయింట్ దగ్గరగా ఉంది.

- Advertisement -

ఈ సినిమాలో హీరో ఒక రచయిత. ఒక కథ రాయడం మొదలుపెడతాడు. అందులో హీరోయిన్ ఐశ్వర్య రాజేష్, హీరోగా తననే ఊహించుకుంటాడు. ఆ హీరో విజయ్ దేవరకొండ. ఏ కారణంతోనైనా కానీ ఆ కథను కొట్టేస్తాడు. మరొక కథ రాయడం మొదలుపెడతాడు. అందులో హీరోయిన్ క్యాథెరిన్. మరో డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ ఎంచుకుంటాడు. అందులో కూడా విజయ్ దేవరకొండనే హీరో. అయితే ఇలా కథలు మార్చే క్రమంలో తన జీవితంలో కూడా ఊహించని మార్పులు జరుగుతాయి. అవేంటి. తన రాసుకున్న కథలకు, జీవితంలో జరుగుతున్న సంఘటనలకు సంబంధమేంటి అనే పాయింట్ తో సినిమా ఉండనుంది. వింటుంటే చాలా ఆసక్తికరంగానే ఉంది. మరి ప్రచారంలో ఉన్న ఈ కథ ఎంతవరకూ నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయకతప్పదు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All