Homeటాప్ స్టోరీస్వరల్డ్ ఫేమస్ లవర్ ప్రివ్యూ

వరల్డ్ ఫేమస్ లవర్ ప్రివ్యూ

వరల్డ్ ఫేమస్ లవర్ ప్రివ్యూ
వరల్డ్ ఫేమస్ లవర్ ప్రివ్యూ

నటీనటులు: విజయ్ దేవరకొండ,  రాశి ఖన్నా, క్యాథెరిన్, ఇజబెల్, ఐశ్వర్య రాజేష్ తదితరులు
దర్శకుడు: క్రాంతి మాధవ్
నిర్మాత: వల్లభ
సంగీత దర్శకుడు: గోపి సుందర్
విడుదల తేదీ: ఫిబ్రవరి 14, 2020

విజయ్ దేవరకొండ నటించిన సినిమాలకు యూత్ లో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. అందులోనూ విజయ్ ప్రేమ కథలు చేసాడంటే దానిపై ఉండే ఆసక్తే వేరు. వరల్డ్ ఫేమస్ లవర్ విషయంలో కూడా ఇదే జరిగింది. ఈ సినిమాకు బజ్ చాలా బాగుంది. ప్రోమోలు, పాటలు అన్నీ కూడా చిత్రంపై అంచనాలు పెంచేసాయి. అందులోనూ తన కెరీర్ లో ఇదే చివరి ప్రేమకథ అని చెప్పి విజయ్ కూడా ఆసక్తికర కామెంట్లు చేయడంతో అందరి దృష్టి ఈ చిత్రంపై పడింది.

- Advertisement -

విజయ్ సరసన ఈ చిత్రంలో నలుగురు హీరోయిన్లు నటించడం విశేషం. రాశి ఖన్నా, క్యాథెరిన్, ఇజబెల్, ఐశ్వర్య రాజేష్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. నాలుగు భిన్న ప్రపంచాలను ఈ చిత్రంలో చూపించామని దర్శకుడు క్రాంతి మాధవ్ తెలిపాడు. ప్రేమికుల రోజు స్పెషల్ గా ఈ చిత్రం విడుదల కానుండడం విశేషం.

విజయ్ నటించిన ఆఖరి చిత్రం డియర్ కామ్రేడ్ ప్లాప్ అయిన నేపథ్యంలో విజయ్ ఈ సినిమాతో హిట్ కొట్టాల్సిన పరిస్థితిలో పడ్డాడు. మరి అర్జున్ రెడ్డి ఛాయలు ఉన్నాయని అనిపించుకున్న ఈ చిత్రం విడుదల తర్వాత ఎటువంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి. ఈ చిత్ర రివ్యూ కోసం మా వెబ్ సైట్ ను వీక్షించండి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All