Homeటాప్ స్టోరీస్వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ రివ్యూ

వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ రివ్యూ

World Famous Lover Movie Review in Telugu
World Famous Lover Movie Review in Telugu

నటీనటులు: విజయ్ దేవరకొండ,  రాశి ఖన్నా, క్యాథెరిన్, ఇజబెల్, ఐశ్వర్య రాజేష్ తదితరులు
దర్శకుడు: క్రాంతి మాధవ్
నిర్మాత: వల్లభ
సంగీత దర్శకుడు: గోపి సుందర్
విడుదల తేదీ: ఫిబ్రవరి 14, 2020
రేటింగ్: 3/5
విజయ్ దేవరకొండ మరో ప్రేమకథతో మన ముందుకు వచ్చాడు. తన కెరీర్ లో వచ్చిన హిట్స్ అన్నీ ప్రేమకథలే. ఈ నేపథ్యంలో మరో భిన్నమైన ప్రేమకథను ఎంచుకున్నాడు. వరల్డ్ ఫేమస్ లవర్ గా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈరోజే విడుదలైంది. అయితే విడుదలకు ముందే సరైన అంచనాలను ఏర్పరుచుకున్న ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ:
గౌతమ్ (విజయ్ దేవరకొండ) రైటర్ అవ్వాలన్న తన కల కోసం చేస్తున్న జాబ్ ను కూడా మానుకుంటాడు. తన కలను నెరవేర్చుకునే పనిలో భాగంగా తన లవర్ యామిని (రాశి ఖన్నా)ను పట్టించుకోవడం మానేస్తాడు. ఈ కారణంగా ఆమె గౌతమ్ ను వదిలేసి వెళ్ళిపోతుంది. దాని తర్వాత గౌతమ్ కథలు రాయడం మొదలుపెడతాడు. యల్లందు అనే పల్లెటూరులో ఒక మధ్య తరగతి ప్రేమకథ. ప్యారిస్ లో ఒక న్యూ ఏజ్ ప్రేమ కథ.. ఇలా భిన్నమైన ప్రేమకథలు రాస్తాడు. నేపధ్యాలు భిన్నవైనా ఆ ప్రేమకథలు ఏ తీరానికి చేరాయి. తన నిజజీవితంలో యామినితో ప్రేమకథ చివరికి ఎలా ముగిసింది అన్నదే వరల్డ్ ఫేమస్ లవర్.

- Advertisement -

నటీనటులు:
విజయ్ దేవరకొండ ఎంత మంచి నటుడన్నది మనం ప్రత్యేకించి మాట్లాడుకోవాల్సిన పనిలేదు. మామూలుగానే తన నటనతో అందరినీ కట్టిపడేసే విజయ్, ఈసారి భిన్న నేపధ్యాలు, భిన్నమైన సెటప్స్ దొరికేసరికి మరింత చెలరేగిపోయాడు. ఒక యూనియన్ లీడర్ గా ఎంత ఎఫెక్టివ్ గా నటించాడో, ప్యారిస్ లో ప్రేమకథలోనూ దానికి తగ్గట్లే సరిపోయాడు విజయ్. ఒక మంచి నటుడు అన్న దానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది.

ముందు నుండి ప్రోజెక్ట్ చేసినట్లుగానే రాశి ఖన్నాది ఇందులో ప్రధాన పాత్ర. ఆమె మెప్పిస్తుంది. ఎక్కువగా ఎమోషనల్ యాంగిల్ ఉన్నా ఆమె నటనతో ప్రేక్షకులు కథలో ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తుంది. మిగతా హీరోయిన్లలో ఐశ్వర్య రాజేష్ మెప్పిస్తుంది. విజయ్ కు పోటీగా ఆమె నటన సాగుతుంది. క్యాథెరిన్ నటన బాగున్నా ఆమెకు దక్కింది చాలా చిన్న పాత్రే. ఇజబెల్ పర్వాలేదు, బాగానే చేసింది. మిగిలిన వాళ్ళు మామూలే.

సాంకేతిక నిపుణులు:
వరల్డ్ ఫేమస్ లవర్ కథ ఊహించదగిందే. ఎక్కువగా ఎమోషన్స్ మీద దృష్టి పెట్టారు. ఇందులో చాలా ప్రేమకథలే ఉన్నా ఎఫెక్టివ్ గా అనిపించేవి రెండే. ఈ సినిమాలో డైలాగ్స్ బాగున్నాయి. స్క్రీన్ ప్లే మరింత ఎఫెక్టివ్ గా ఉండవచ్చు, ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో. గోపి సుందర్ అందించిన మ్యూజిక్ పర్వాలేదు. అయితే తన ట్రాక్ రికార్డ్ తో పోల్చుకుంటే ఈ సినిమాలో ఇంకా బాగా పాటలు ఇవ్వొచ్చన్న ఫీలింగ్ కలుగుతుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సినిమాటోగ్రఫీ రైట్ మూడ్ సెట్ చేయడంలో ఉపయోగపడింది. ఎడిటింగ్ చాలా నీట్ గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాకు ఎంత కావాలో అంతా ఖర్చు పెట్టిన భావన కలుగుతుంది.

విశ్లేషణ:
వరల్డ్ ఫేమస్ లవర్ కథ సింపుల్ గా సాగిపోతుంది. ఫస్ట్ హాఫ్ ప్రధానంగా ఆకట్టుకుంటుంది. ఇక్కడ వచ్చే సువర్ణ, శీనయ్యల మధ్య ట్రాక్ మనసును హత్తుకుంటుంది. ఇక్కడ హార్ట్ టచింగ్ ఎమోషన్స్ ఉన్నాయి. అయితే సెకండ్ హాఫ్, మొదటి భాగంతో పోల్చుకుంటే కొంచెం స్లో, డల్ అయిన భావన కలుగుతుంది. క్లైమాక్స్ మరో వీక్ పాయింట్ గా అనిపిస్తుంది. అయితే ఈ నెగటివ్స్ ను పక్కనపెట్టి చూస్తే విజయ్ దేవరకొండ పెర్ఫార్మన్స్, శీనయ్య, సువర్ణల లవ్ స్టోరీ వంటి ప్లస్ పాయింట్స్ కారణంగా సినిమాను ఒకసారి చూడవచ్చు.

World Famous Lover Movie Review in English

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All