Sunday, September 25, 2022
Homeన్యూస్విజయ్‌దేవరకొండతో చేద్దామనుకున్నా.. !

విజయ్‌దేవరకొండతో చేద్దామనుకున్నా.. !

Sri Pawar
విజయ్‌దేవరకొండతో చేద్దామనుకున్నా.. !

శ్రీనిక క్రియేటివ్ వ‌ర్క్స్ ప‌తాకంపై రూపొందుతున్న చిత్రం `2 అవ‌ర్స్ ల‌వ్‌`. ఈ చిత్రంతో శ్రీప‌వార్ హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ఆయ‌నే క‌థ రాసి, ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్ర‌మిది. కృతి గ‌ర్గ్ క‌థానాయిక‌గా న‌టించారు. త‌నికెళ్ల‌భ‌ర‌ణి, న‌ర్సింగ్ యాద‌వ్‌, అశోక వ‌ర్ధ‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. పివిఆర్ సంస్థ ద్వారా ఈ చిత్రం శుక్రవారంమ్ రిలీజ్ కానుంది. ఈ సినిమా గురించి ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కుడు, హీరో శ్రీ ప‌వార్ 2 అవర్స్ లవ్ చిత్రం గురించి పలు విశేషాలు వెల్లడించారు.

- Advertisement -

” మాది హైదరాబాద్ లోక‌ల్ అండీ. నేను పుట్టింది, పెరిగింది అంతా ఇక్క‌డే. 5 సంవత్సరాలు ఐటీ జాబ్ చేశాను. నాకు బేసిగ్గా ర‌చ‌న – ద‌ర్శ‌క‌త్వం అంటే ఇష్టం. ఆ ఇష్టంతోనే ఏడాదిన్న‌ర పాటు కూర్చుని క‌థ రాసుకున్నా. నేను రాసుకున్న క‌థ విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు చ‌క్క‌గా స‌రిపోతుంద‌నిపించింది. అప్పుడు ఆయ‌న న‌టించిన `పెళ్లిచూపులు` చూసి అలా ఫిక్స‌య్యా. ఆ సినిమా విడుద‌ల‌య్యే నాటికి నా క‌థ 80 శాతం మాత్ర‌మే లాక్ అయి ఉంది. ఆ మిగిలిన స్క్రిప్ట్ ను లాక్ చేసే స‌రికి `అర్జున్ రెడ్డి` విడుద‌లైంది. అప్ప‌టికే ఆయ‌న రెండు, మూడు సినిమాలు సైన్ చేశారు. ఆ సినిమాతో స్టార్ హీరో అయ్యారు. ఇక విజయ దేవరకొండని రీచ్ కాలేకపోయాను.

దాని తరువాత మ‌రో ఇద్ద‌రు, ముగ్గురికి చెప్పా. కానీ వారు మాట్లాడిన తీరు చూస్తుంటే నా క‌థ‌లో వేలు పెడ‌తారేమోన‌ని అనిపించింది. . అందుకే వారితో వెళ్లాల‌నిపించ‌లేదు. నాకు రైట‌ర్‌గా, డైర‌క్ట‌ర్‌గా కాంప్ర‌మైజ్ కావ‌డం ఇష్టం లేదు. పైగా నేను సుకుమార్ సినిమాల‌ను ఇష్ట‌ప‌డ‌తాను. ఆయ‌న‌లాగా సీన్స్, ఆయ‌న థాట్ ప్రాస‌స్ నాకు చాలా ఇష్టం. అలాగ‌ని సినిమాల‌ను చూసి కాపీ కొట్ట‌ను. ఒక సినిమాను చూసి కాపీ కొట్టి రాయ‌డం నాకు న‌చ్చ‌దు. చాలా ఫ్రెష్ గా ఉండేలా ఈ చిత్రంలో సీన్స్ రాశాను. చాలా కొత్తగా ఉంటాయి. అందుకే నేనే ఈ సినిమాలో యాక్ట్ చేశాను.

కథ విషయానికి వస్తే సాయంత్రం నాలుగు గంట‌ల‌కు ముందు, ఆరు గంట‌ల త‌ర్వాత ప్రేమించుకుంటారు. ఆ టైములో ఏం జ‌రిగినా ఆ అమ్మాయికి అస్స‌లు సంబంధం ఉండద‌న్న‌మాట‌. అలా రెండు గంటల్లో ప్రేమ ఎలా సాగింది, దానివల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి అనేది కథ. హీరోయిన్ కి ఇంపార్టెన్స్ ఎక్కువ‌గా ఉంటుంది. రొమాంటిక్ కామెడీ త‌ర‌హా సినిమా. ప్ర‌తి సీనూ ఎలా ఉండ‌బోతుందోన‌నే టెన్ష‌న్ ఉంటుంది.

చిన్న సినిమా షో అని పిల‌వ‌గానే అంత తేలిగ్గా ఎవ‌రూ ముందుకు రారు. అలాంటిది మా సినిమా కాన్సెప్ట్ న‌చ్చి చాలా మంది సినిమా చూశారు. పీవీఆర్ వాళ్ల‌కు కూడా అలాగే తెలిసి చూశారు. కంటెంట్ న‌చ్చి సినిమాను విడుద‌ల చేస్తున్నారు. ఇప్ప‌టికే మా ట్రైల‌ర్ల‌కు, పాట‌ల‌కు చాలా మంచి టాక్ వ‌చ్చింది. సినిమా కూడా అందరికీ నచ్చుతుందని కాన్ఫిడెన్స్ తో వున్నాను… అన్నారు దర్శకుడు కమ్ హీరో శ్రీ పవార్..!!

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts