
బెల్లంకొండ శ్రీనివాస్ ను హీరోగా ఇంట్రడ్యూస్ చేసాడు వి.వి వినాయక్. అల్లుడు శీను చిత్రం ద్వారా బెల్లంకొండ బాబు ఇంట్రడ్యూస్ అవ్వగా ఆ సినిమా మంచి విజయం సాధించింది. చూస్తుంటే బెల్లంకొండ శ్రీనివాస్ ను బాలీవుడ్ లో కూడా వినాయక్ ఇంట్రడ్యూస్ చేసేలా కనిపిస్తోంది.
గత కొన్ని రోజుల నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వి వి వినాయక్ దర్శకత్వంలో ఛత్రపతి రీమేక్ ను బాలీవుడ్ లో చేస్తారని ప్రచారం జరుగుతోంది. ముందు సుజీత్ ను దర్శకుడిగా అనుకున్నారు కానీ అది వర్కౌట్ అవ్వలేదు. రీమేక్ ను చేయడానికి సుజీత్ ఇష్టపడలేదు. ఈ నేపథ్యంలో వి వి వినాయక్ ను బాలీవుడ్ నిర్మాతలు అప్రోచ్ అయ్యారు.
ముందుగా మెగాస్టార్ చిరంజీవి వినాయక్ ను లూసిఫెర్ రీమేక్ కోసం అప్రోచ్ అవ్వగా దాని మీద వర్క్ చేసి చిరుకి తన వెర్షన్ వినిపించగా ఇంకా బెటర్మెంట్ ను అడిగినట్లు తెలుస్తోంది. అందుకనే వినాయక్ ఆ ప్రాజెక్టును పక్కనపెట్టి వేరే ప్రాజెక్టులపై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మూడేళ్లు వినాయక్ సినిమా లేకుండా ఉన్నాడు. అందుకనే త్వరగా ఒక ప్రాజెక్టును పట్టాలని ఎదురుచూస్తున్నాడు.