Homeటాప్ స్టోరీస్సైరా ముందున్న అతిపెద్ద సవాల్ ఇదే

సైరా ముందున్న అతిపెద్ద సవాల్ ఇదే

Syeraa Narasimha Reddy
సైరా ముందున్న అతిపెద్ద సవాల్ ఇదే

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి అక్టోబర్ 2న విడుదలకు ముస్తాబవుతోంది. తాజాగా ఈ సినిమా ప్రాధమిక రన్ టైమ్ ను లాక్ చేసారు. చరిత్ర మరిచిపోయిన పోరాట యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన సైరా ప్యాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతోంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంతో పాటు హిందీలో కూడా ఈ సినిమా విడుదల కాబోతోంది.

ఇది పక్కనపెడితే సైరా ముందున్న అతిపెద్ద సవాల్ నార్త్ మార్కెట్ ను చేజిక్కించుకోవడం. ఇటీవలే విడుదలైన సాహో చిత్రం అంతటి బ్యాడ్ టాక్ లో కూడా 300 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. కేవలం హిందీ వెర్షన్ మాత్రమే 100 కోట్ల నెట్ సాధించింది. ఇదంతా బాహుబలి ద్వారా ప్రభాస్ ఇమేజ్ కారణంగా వచ్చిన వసూళ్లు. ప్రభాస్ స్టామినాతోనే సాహో అక్కడ అద్భుతం చేసింది.

- Advertisement -

మరి అలాంటి అద్భుతాన్ని సైరా కూడా రిపీట్ చేయగలదా? ప్రభాస్ కున్న మార్కెట్ అడ్వాంటేజ్ చిరుకు లేదు. మరి హిందీలో ఎప్పుడో సినిమా చేసిన చిరంజీవిని అక్కడి ప్రజలు గుర్తిస్తారా? పైగా సైరాకు పోటీగా బాలీవుడ్ లో హృతిక్ రోషన్ వార్ సినిమా విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో సైరా నార్త్ లో ఎలా ఆడుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All