Homeటాప్ స్టోరీస్ఎన్టీఆర్ అందుకు ఒప్పుకుంటాడా

ఎన్టీఆర్ అందుకు ఒప్పుకుంటాడా

Will NTR support to kalyan ramతెలంగాణలో ఎన్నికలవేడి రాజుకుంది , ముందస్తు ఎన్నికలు రావడంతో అన్ని పార్టీలు ఎవరి వ్యూహాల్లో వాళ్ళు ఉన్నారు . అయితే తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడినప్పటికీ ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లోని 28 నియోజకవర్గాల్లో సెటిలర్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు వాళ్ళు గంపగుత్తగా ఎవరికి ఓట్లు వేస్తే వాళ్ళు గెలవడం ఖాయం . దాంతో తెలుగుదేశం పార్టీ తరుపున నందమూరి కళ్యాణ్ రామ్ ని అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయించాలని భావిస్తోందట ! ఇప్పుడున్న పరిస్థితుల్లో నందమూరి కళ్యాణ్ రామ్ పోటీ చేయడం కష్టమే ! అయితే ఒకవేళ కళ్యాణ్ రామ్ ఒప్పుకున్నా ఎన్టీఆర్ అందుకు ఒప్పుకుంటాడా అన్నది తేలాల్సి ఉంది .

గత ఎన్నికల్లో ఎన్టీఆర్ తో పాటుగా హరికృష్ణ , కళ్యాణ్ రామ్ లు తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉన్నారు . అయితే ఇటీవలే హరికృష్ణ మరణించడంతో మళ్ళీ నందమూరి కుటుంబం ఒక్కటయ్యింది . అలాగే నారా చంద్రబాబు నాయుడితో కూడా కలిసిపోయింది . గ్రేటర్ లో గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరధం పట్టారు ఓటర్లు అయితే తెలంగాణలో జరిగిన కొన్ని పరిణామాల వల్ల తెలుగుదేశం పార్టీకి చెందిన 12 మంది తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు . దాంతో తెలుగుదేశం పార్టీ అడ్రస్ లేకుండాపోయింది . అందుకే ఈ ఎన్నికల్లో కళ్యాణ్ రామ్ ని గ్రేటర్ లోని ఏదో ఒక నియోజకవర్గం నుండి పోటీ చేయించాలని భావిస్తున్నారట ! మరి నందమూరి సోదరులు కళ్యాణ్ రామ్ , ఎన్టీఆర్ లు అందుకు ఒప్పుకుంటారా చూడాలి .

- Advertisement -

English Title: Will NTR support to kalyan ram

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All