Homeగాసిప్స్హరీష్ రావు కొత్త పార్టీ పెట్టనున్నాడా ?

హరీష్ రావు కొత్త పార్టీ పెట్టనున్నాడా ?

harish rao
harish rao

మాజీ మంత్రి , సిద్ధిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు కొత్త పార్టీ పెట్టనున్నాడా ? అంటే ఊహాగానాలు అలాగే వినిపిస్తున్నాయి . గతకొంత కాలంగా హరీష్ రావు ని తెలంగాణ ప్రభుత్వం కావాలనే పక్కన పెడుతున్న విషయం తెలిసిందే . దాంతో హరీష్ రావు కంటే అతడి అనుచరులు అలాగే హరీష్ అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు .

గత టర్మ్ లో హరీష్ రావు కు కీలక జలవనరుల శాఖామంత్రిగా పదవి బాధ్యతలు అప్పగించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ . అయితే మళ్ళీ గెలిచాక మాత్రం మంత్రి పదవి ఇవ్వలేదు . అలాగే ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభించారు , కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం కష్టపడినా వాళ్ళని సన్మానించారు కేసీఆర్ కానీ అందులో హరీష్ రావు లేడు , పిలవలేదు కూడా . తమ నేతకు కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించకపోవడంతో మరింతగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . అయితే అనుచరులు ఎంతగా మొత్తుకుంటున్నా హరీష్ మాత్రం మౌనమే నీ భాష ఓ మూగ మనసా ! అంటూ మౌనాన్ని ఆశ్రయిస్తున్నాడు . హరీష్ రావు ఇంత మౌనంగా ఉంటున్నాడంటే రాబోయే పెను తుఫాన్ కు ఇది సంకేతం అని అంటున్నారు . అంతేకాదు హరీష్ రావు కొత్త పార్టీ పెట్టడం ఖాయమని లేదంటే బీజేపీ మద్దతు తీసుకోవడం ఖాయమని గుసగుసలు వినిపిస్తున్నాయి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All