Homeగాసిప్స్అశుతోష్ గోవారికర్ చరిత్రను మళ్ళీ చెడగొడతాడా ..?

అశుతోష్ గోవారికర్ చరిత్రను మళ్ళీ చెడగొడతాడా ..?

అశుతోష్ గోవారికర్ చరిత్రను మళ్ళీ చెడగొడతాడా ..?
అశుతోష్ గోవారికర్ చరిత్రను మళ్ళీ చెడగొడతాడా ..?

చరిత్రలో నిలిచిపోయిన మహాయుద్ధం పానిపట్. 1761 జనవరి 14 వ తేదీన యావత్ భారతదేశ చరిత్రలో మరిచిపోలేని ఒక మహా సంగ్రామం జరిగింది. భారతదేశ ఆత్మగౌరవానికి దోపిడీదారుల అత్యాశకు మధ్య జరిగినది మూడవ పానిపట్టు యుద్ధం. భారతదేశం పై దురాక్రమణ చేస్తున్న అహ్మద్ షా దుర్రానీ కి, వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన మరాఠా సామ్రాజ్య యోధులకు మధ్య జరిగిన ఆ యుద్ధంలో జయాపజయాలకు అతీతంగా మన మట్టిపై పుట్టి, మన దేశం పరాయి వాళ్ళ చేతుల్లోకి పోకుండా వీరోచితంగా పోరాడి, అమరవీరుల అయినటువంటి అమరవీరులకు స్వార్ధం తో నిండిపోయిన ప్రస్తుత చరిత్ర సముచిత స్థానం ఇవ్వలేదు. కారణాలు ఎలా ఉన్నా ప్రస్తుతం ఆ కథాంశాన్ని ఒక చిత్రంగా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు అశుతోష్ గోవారికర్. ఇంతకుముందు జోధా అక్బర్ అనే సినిమా తీసి సాంకేతికంగా ఉన్నతంగా ఉంది అని అనిపించినా, చరిత్రను వక్రీకరించాడన్న చెడ్డ పేరు సంపాదించిన గోవారికర్ మళ్లీ ఇప్పుడు అలాంటి ప్రయత్నమే చేయబోతున్నట్లు అనిపిస్తోంది.

ఈ సినిమాలో మరాఠా యోధుడు సదాశివరావు పాత్రలో అర్జున్ కపూర్, గోపిక బాయి పాత్రలో పద్మిని, సదా శివ రావు భార్య పార్వతి పాత్రలో కృతిసనన్, మొగల్ దురాక్రమణ దారుడు అహ్మద్ షా అబ్దాలీ పాత్రలో బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ నటిస్తున్నారు. రెండు రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా ట్రైలర్ టెక్నికల్ గా ఎంతో ఉన్నతంగా అనిపించింది. సంజయ్ దత్ పాత్ర ట్రైలర్ చివరిలో “ఒక గుప్పెడు మట్టి కోసం ఎందుకు నువ్వు ఇంత ఆరాటపడుతున్నావ్! అని ప్రశ్నించగా “నా మాతృభూమి కి సంబంధించినంతవరకు ఒక క్షణం కోసం కూడా నేను చనిపోవడానికి సిద్ధపడతానని”,అర్జున్ కపూర్ పాత్ర చెప్పే డైలాగ్ ఎంత ఎమోషనల్ గా ఉంది. డైరెక్టర్ అసుతోష్ గోవారికర్ స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్స్ అజయ్ అతుల్ ఇచ్చిన సంగీతం అద్భుతంగా ఉంది. ఏదైనా సినిమా వాళ్ళ పరిస్థితి “కాళిదాసు కవిత్వం – కొంత నా పైత్యం కొంత” అన్నట్లు తయారైంది. ఏది ఏమైనా అంటే సినిమాటిక్ లిబర్టీ అంటున్నారు. మరి అశుతోష్ గోవారికర్ ఈ సినిమాని అయినా చరిత్రలో ఉన్నది ఉన్నట్లు తీస్తాడా..? లేక జోధా అక్బర్ సినిమాలో లాగా చరిత్ర వక్రీకరణకు పాల్పడతాడా.? అనేది సినిమా రిలీజ్ అయ్యాక తెలుస్తుంది

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All