ప్రముఖ హాస్య నటుడు ఆలీ గుంటూరు నుండి అసెంబ్లీ కి పోటీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు . తెలుగుదేశం పార్టీ తో ఆలీ కి దాదాపు ముప్పయ్యేళ్ల అనుబంధం ఉంది పైగా చంద్రబాబు నాయుడు తో కూడా మంచి సాన్నిహిత్యం ఉంది దాంతో ఈసారి తప్పకుండా అసెంబ్లీ కి పోటీ చేయాలనీ శాసనసభలో అడుగు పెట్టాలని భావిస్తున్నాడు . రకరకాల పార్టీలలో ఆలీ చేరతాడని ఊహాగానాలు వచ్చాయి కానీ తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చేయడానికి దాదాపుగా సిద్దమయ్యాడు .
అయితే ఆలీ గెలుస్తాడా ? అసెంబ్లీ లో అడుగు పెడతాడా ? తన చిరకాల వాంఛ అయిన మంత్రి పదవి కూడా కొట్టేస్తాడా ? అంటే బోలెడు అనుమానాలు ఎందుకంటే ముందుగా తెలుగుదేశం పార్టీ టికెట్ రావాలి , ఆ తర్వాత ఎన్నికల్లో ప్రజలు ఓటెయ్యాలి అది అయ్యాక చంద్రబాబు అధికారంలోకి మళ్ళీ రావాలి అప్పుడు మంత్రి పదవి ఇలా బోలెడు చిక్కులు ఉన్నాయి మరి . తాజాగా గుంటూరు వెళ్లిన ఆలీ హైదరాబాద్ లో ఉన్న తన ఓటు ని రద్దు చేసి గుంటూరు లో ఓటు హక్కు కల్పించాల్సిందిగా కోరాడు ఎన్నికల సంఘం ని అంటే ఆలీ ఎన్నికల్లో పోటీ చేయడం కన్ఫర్మ్ అయ్యింది . ఇక ఎం ఎల్ ఏ గా గెలుస్తాడా ? మంత్రి పదవి చేపడతాడా ? చూడాలి .మే నెలాఖరున లేదా జూన్ నెలలో ఈ విషయం తేలిపోనుంది .
English Title: Will Ali win in ap assembly?