Homeటాప్ స్టోరీస్వైఫ్ ఆఫ్ రామ్ సక్సెస్ కోసం వైఫ్ ఆఫ్ నాని

వైఫ్ ఆఫ్ రామ్ సక్సెస్ కోసం వైఫ్ ఆఫ్ నాని

wife of nani wishes to wife of ramవైఫ్ ఆఫ్ రామ్ చిత్రం సక్సెస్ కోసం వైఫ్ ఆఫ్ నాని ఆరాటపడుతోంది . మంచు లక్ష్మి కి నాని భార్య అంజనా మంచి ఫ్రెండ్ కావడంతో మంచు లక్ష్మి నటించిన వైఫ్ ఆఫ్ రామ్ విజయవంతం కావాలని ఆశిస్తూ శుభాకాంక్షలు అందజేస్తోంది . ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు మంచు లక్ష్మి కి శుభాకాంక్షలు అందజేసి సినిమాపై అంచనాలు పెంచేలా చేయడమే కాకుండా మంచు లక్ష్మి పై తమకున్న ప్రేమానురాగాలను వ్యక్తం చేసారు . కాగా ఇప్పుడు నాని భార్య అంజనా వంతు వచ్చింది .

కొత్త దర్శకుడు విజయ్ ఎలకంటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని విశ్వప్రసాద్ – వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా నిర్మించారు . ఈనెల 20న వైఫ్ ఆఫ్ రామ్ విడుదలకు సిద్ధమైంది . టీజర్ తో సినిమాపై అంచనాలను పెంచిన ఈ చిత్రం ట్రైలర్ తో మరింతగా ఆకట్టుకుంది . హర్రర్ నేపథ్యంలో తెరకెక్కిన వైఫ్ ఆఫ్ రామ్ చిత్రం విభిన్న తరహా చిత్రాలను కోరుకునే ప్రేక్షకులకు మంచి ఛాయిస్ అన్న టాక్ వినిపిస్తోంది . అంతేకాదు స్నేహశీలి అయిన మంచు లక్ష్మి కి సాలిడ్ హిట్ రావాలని మనసారా ఆకాక్షిస్తున్నారు పలువురు ప్రముఖులు అందుకే వరుస పెట్టి శుభాకాంక్షలు అందజేస్తూ వైఫ్ ఆఫ్ రామ్ పై ఆసక్తిని పెంచుతున్నారు . ఇక మంచు లక్ష్మీ కూడా ఈ సినిమాపై చాలా నమ్మకంగా ఉంది . ఇక వైఫ్ ఆఫ్ రామ్ భవితవ్యం ఏంటి అన్నది తెలియాలంటే ఈనెల 20 వరకు ఎదురు చుడాల్సిందే .

- Advertisement -

English Title: wife of nani wishes to wife of ram

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All