Homeటాప్ స్టోరీస్విజ‌య్‌సేతుప‌తిని అందుకే వద్ద‌న్నారా?

విజ‌య్‌సేతుప‌తిని అందుకే వద్ద‌న్నారా?

విజ‌య్‌సేతుప‌తిని అందుకే వద్ద‌న్నారా?
విజ‌య్‌సేతుప‌తిని అందుకే వద్ద‌న్నారా?

విల‌క్ష‌ణ‌మైన న‌ట‌న‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచిన నటుడు విజ‌య్ సేతుప‌తి. త‌మిళంలో ఆయ‌న‌తో త‌మ సినిమాలో చిన్న అతిథి పాత్ర అయినా స‌రే చేయించుకోవాల‌ని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు చూస్తుంటారు. అలాంటి విల‌క్ష‌ణ న‌టుడినే బాలీవుడ్ స్టార్ వ‌ద్దన్నా? అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. వివ‌రాల్లోకి వెళితే…విజ‌య్ సేతుప‌తి క్రేజ్ ఏ స్థాయిలో వుంద‌న్న‌ది ఇటీవ‌ల విడుద‌లైన `ఉప్పెన‌` చిత్రంతో స్ప‌ష్ట‌మైంది.

అలాంటి క్రేజీ న‌టుడినే బాలీవుడ్ స్టార్ ప‌క్క‌న పెట్ట‌డం ప్ర‌స్తుతం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ అమీర్‌ఖాన్ కొంత విరామం త‌రువాత హాలీవుడ్ హిట్ ఫిల్మ్ `ఫారెస్ట్ గంప్‌` ఆ ధారంగా రూపొందుతున్న`లాల్ సింగ చ‌ద్దా` చిత్రంలో సిక్కు వ‌యుకుడిగా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీలో క‌రీనా క‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

- Advertisement -

ఈ చిత్రంలోని ఓ కీల‌క పాత్ర కోసం మేక‌ర్స్‌, అమీర్‌ఖాన్ త‌మిళ హీరో విజ‌య్ సేతుప‌తిని ఎంపిక చేసుకున్నారు. త్వ‌ర‌లోనే షూటింగ్ కోసం విజ‌య్ సేతుప‌తి సెట్‌లోకి అడుగుపెట్టాలి. అయితే ఇంతలోనే అత‌న్ని ఈ సినిమా నుంచి తొల‌గించారు. తానే ఈ చిత్రం నుంచి డేట్స్ స‌ర్దుబాటు కాని కార‌ణంగా త‌ప్పుకుంటున్నాన‌ని ప్ర‌క‌టించారు విజ‌య్‌సేతుప‌తి. కానీ అస‌లు కార‌ణం డేట్స్ కాద‌ని, విజ‌య్ సేతుప‌తి బ‌రువు పెర‌గ‌డ‌మేన‌ని తెలిసింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All