
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లో స్పెషల్ చిత్రంగా రంగస్థలం మిగిలిపోతుంది. తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ రంగస్థలం. కలెక్షన్స్ మాత్రమే కాకుండా నటుడిగా ఉన్నతస్థాయికి చేరుకున్నాడు రామ్ చరణ్. తనను ట్రోల్ చేసే వారు కూడా రంగస్థలంలో తన నటన చూసి ఫిదా అయ్యారంటే అందులో కచ్చితంగా దర్శకుడు సుకుమార్ కు కూడా క్రెడిట్ ఉంటుంది. అలాంటి స్పెషల్ చిత్రం అందించిన సుకుమార్ రీసెంట్ గా జరిగిన సైరా ప్రీ రిలీజ్ వేడుకకు రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
బన్నీ ఈ ఈవెంట్ కు దూరంగా ఉండడం కూడా మెగా ఫ్యాన్స్ మధ్య పలు సందేహాలకు కారణమైంది. ఇప్పుడు బన్నీతో సినిమా చేయబోతున్న సుకుమార్ కూడా ఈ ఈవెంట్ కు రాకపోవడం దీన్ని బలపరుస్తోంది. చిరు 150, 152 సినిమాల దర్శకులు వివి వినాయక్, కొరటాల శివ ఈ ఈవెంట్ కు విచ్చేసారు. అలాగే చరణ్ తో ఇప్పుడు సినిమా చేస్తున్న రాజమౌళి కూడా ఈ ఈవెంట్ లో పాల్గొన్నాడు. మరి చరణ్ కు అంత స్పెషల్ చిత్రాన్ని అందించిన సుకుమార్ ఎందుకు రానట్లు.
సుకుమార్ ఈవెంట్ జరిగిన రోజు హైదరాబాద్ లోనే ఉన్నాడు. బన్నీ సినిమా స్క్రిప్ట్ పనులతో బిజీగా ఉన్నాడు. అంటే సుకుమార్ రాలేదా లేదా తనని అసలు పిలవలేదా అంటూ కొన్ని వర్గాలు చర్చించుకుంటున్నాయి. మొత్తానికి మెగా ఫ్యామిలీలో ఏదో జరుగుతోంది అన్నది మాత్రం నిజం.