Homeటాప్ స్టోరీస్శ్రీ రెడ్డి ఎన్ని ఆరోపణలు చేసినా నాని స్పందించడే

శ్రీ రెడ్డి ఎన్ని ఆరోపణలు చేసినా నాని స్పందించడే

why sri reddy hates nani soo muchవివాదాస్పద నటి శ్రీ రెడ్డి టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే . తాజాగా మరోసారి హీరో నాని పై ఆరోపణలు చేసి మరింత సంచలనం సృష్టిస్తోంది . ”నాని కి నాకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటది …… ఏం చేద్దాం నాని మరి ??” అంటూ తాజాగా నాని పై మళ్ళీ ఆరోపణలు చేసింది శ్రీ రెడ్డి . ఈ వివాదాస్పద భామ ఇలా ట్వీట్ చేయడానికి కారణం ఏంటో తెలుసా ……. బిగ్ బాస్ 2 షో ఈనెల 10 నుండి ప్రారంభం అవుతోంది అంతేకాదు ఆ షోలో శ్రీ రెడ్డి పాల్గొంటుండగా అదే షోకి నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే .

అంటే ఇద్దరూ కలిసి మాట్లాడుకోవాలి , ఒకరి ముఖం ఒకరు చూసుకోవాలి కానీ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటది కాబట్టి ఏం చేద్దాం నాని అంటూ అతడ్ని కవ్విస్తోంది శ్రీ రెడ్డి . ఇంతకుముందు నాని పై ఘోరమైన వ్యాఖ్యలు చేసింది శ్రీరెడ్డి . నాని తెరమీద నటించడమే కాదు నిజ జీవితంలో కూడా నటించే న్యాచురల్ స్టార్ అంటూ కించపరచడమే కాకుండా పలువురు అమ్మాయిలను వాడుకున్నాడని సంచలన వ్యాఖ్యలు చేసింది . అయితే శ్రీ రెడ్డి ఎంతగా ఆరోపణలు చేసినప్పటికి నాని మాత్రం అస్సలు స్పందించలేదు . కట్ చేస్తే ఇప్పుడు కూడా నాని కి సవాల్ విసురుతోంది దాంతో బిగ్ బాస్ 2 షోలో నాని శ్రీ రెడ్డి పట్ల ఎలా స్పందిస్తాడో చూడాలి .

- Advertisement -

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All