Homeటాప్ స్టోరీస్నాగార్జున ఆ సినిమా నుండి ఎందుకు తప్పుకున్నట్లు?

నాగార్జున ఆ సినిమా నుండి ఎందుకు తప్పుకున్నట్లు?

నాగార్జున ఆ సినిమా నుండి ఎందుకు తప్పుకున్నట్లు?
నాగార్జున ఆ సినిమా నుండి ఎందుకు తప్పుకున్నట్లు?

అక్కినేని నాగార్జున ఇప్పుడు కెరీర్ లో డౌన్ ఫేజ్ ను ఎదుర్కొంటున్నాడు. కింగ్ దగ్గరనుండి హిట్ వచ్చి చాలా కాలమైంది. అయితే నాగార్జున ప్రస్తుతం తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తుండడం విశేషం. బాలీవుడ్ మూవీ బ్రహ్మాస్త్రలో కీలక పాత్రలో నటించాడు నాగార్జున. ఆ సినిమా త్వరలో విడుదలవుతుంది. భారీ బడ్జెట్ లో ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

దీంతో పాటు నాగార్జున మలయాళంలో కూడా అరంగేట్రం చేయనున్నట్లు అప్పట్లో ప్రకటించాడు. మోహన్ లాల్ హీరోగా తెరకెక్కబోయే చిత్రంలో తాను ఒక చిన్న పాత్రలో నటిస్తున్నట్లు షూటింగ్ లో కూడా పాల్గొంటున్నట్లు అప్పట్లో స్వయంగా తెలిపాడు నాగ్. తనకు అత్యంత సన్నిహితమైన దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కించే సినిమా కావడంతో కాదనలేకపోయానని చెప్పాడు. నిజంగానే నాగ్ కు ప్రియదర్శన్ అంటే అభిమానమే. ఇద్దరూ కలిసి అప్పట్లో నిర్ణయం అనే సినిమాను చేసారు. ఈ మధ్యలో అఖిల్ హీరోగా తెరకెక్కిన హలో చిత్రంలో ప్రియదర్శన్ కూతురు కళ్యాణిని హీరోయిన్ గా అరంగేట్రం చేయించాడు నాగ్. ఆ చొరవతోనే ప్రియదర్శన్ అడిగిన వెంటనే మోహన్ లాల్ చిత్రంలో చిన్న పాత్ర చేయడానికి ఒప్పుకున్నాడు.

- Advertisement -

ఆ చిత్రమే మరక్కార్. ఈ సినిమా ట్రైలర్ ఇప్పుడు విడుదలైంది. తెలుగులో చిరంజీవి, రామ్ చరణ్, మహేష్ బాబులు విడుదల చేసారు. అయితే ఇందులో నాగార్జున నటించిన దాఖలాలు కనిపించలేదు. షూటింగ్ లో కూడా పాల్గొన్నాక ఏమైంది? ఎందుకని ఈ సినిమా నుండి నాగార్జున తప్పుకున్నాడు. చూస్తుంటే నాగార్జున స్థానంలో అర్జున్ లేదా ప్రభులు నటించి ఉండాలి. మరి కారణమైతే బయటకు రాలేదు కానీ నాగార్జున మాత్రం మరక్కార్ లో లేడు. ఉండి ఉంటే తెలుగు రిలీజ్ వరకూ బజ్ భారీగా ఉండేది.

సముద్రపు దొంగలు, యుద్ధాలు నేపథ్యంలో మలయాళంలో అత్యంత ఖరీదైన చిత్రంగా ఇది నిలిచింది. మరి విడుదలయ్యాక ఎలా ఉంటుందో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All