Homeటాప్ స్టోరీస్ఆ భామతో ఫోటో షూట్ ఎందుకు చేసినట్లు

ఆ భామతో ఫోటో షూట్ ఎందుకు చేసినట్లు

why did they photoshoot with pooja hegdeబాహుబలి తో ప్రభాస్ రేంజ్ పెరిగింది , అయితే పర్సనాలిటీ పరంగా ప్రభాస్ అరడుగులపైనే అలాంటి ప్రభాస్ సరసన హీరోయిన్ లు కూడా సరిగ్గా సెట్ అవ్వాలి లేకపోతే జోడి అనిపించుకోదు అందుకే జాగ్రత్తలు తీసుకొని మరీ హీరోయిన్ లను సెలెక్ట్ చేస్తుంటారు . కానీ పెద్దగా ఆలోచించకుండానే ప్రభాస్ – జిల్ ఫేమ్ రాధాకృష్ణ ల కాంబినేషన్ లో రూపొందే చిత్రంలో పూజా హెగ్డే ని హీరోయిన్ గా ఎంపిక చేసారు కట్ చేస్తే ఇక సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది అని అనుకుంటున్న సమయంలో పూజా హెగ్డే ప్రభాస్ ల జంట బాగుంటుందా ? అన్న అనుమానం వచ్చిందట దాంతో ఫోటో సెషన్ చేశారట .

పూజా హెగ్డే అసలే బక్క పీచు భామ జీరో సైజ్ అందాల భామ కావడంతో ఆరడుగుల ఆజానుబాహుడు అయిన ప్రభాస్ పక్కన ఎలా ఉంటుందో ఒకసారి చెక్ చేసుకుందామని ఫోటో షూట్ పెట్టారని వినికిడి . ప్రస్తుతం ప్రభాస్ సుజిత్ దర్శకత్వంలో ” సాహో ” చిత్రం చేస్తున్నాడు . అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ శ్రద్దా కపూర్ నటిస్తోంది . పూజా హెగ్డే ని రాధాకృష్ణ సినిమా కోసం తీసుకున్నారు . డౌట్ క్లియరెన్స్ కోసం ఫోటో షూట్ చేశారట ! మరి సెట్ అవుతుందా ? లేక ఏమైనా మార్పులు చేస్తారా చూడాలి .

- Advertisement -

English Title: why did they photoshoot with pooja hegde

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All