Homeటాప్ స్టోరీస్`బాషా` చిరు చేయ‌క‌పోవ‌డానికి కార‌ణం ఎవ‌రు?

`బాషా` చిరు చేయ‌క‌పోవ‌డానికి కార‌ణం ఎవ‌రు?

`బాషా` చిరు చేయ‌క‌పోవ‌డానికి కార‌ణం ఎవ‌రు?
`బాషా` చిరు చేయ‌క‌పోవ‌డానికి కార‌ణం ఎవ‌రు?

త‌మిళ సూపర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించింన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ `బాషా`. సురేష్‌కృష్ణ తెర‌కెక్కించిన ఈ మూవీ ర‌జ‌నీని పాన్ ఇండియా స్టార్‌ని చేసింది. ఇత‌ర దేశాల్లోనూ అంటే జాపాన్‌లోనూ ర‌జ‌నీకి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ని ఏర్ప‌రిచింది. ఆ త‌రువాత తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో వ‌చ్చిన చిత్రాల‌కు స్క్రీన్ ప్లే ప‌రంగా స‌ర‌కొత్త వొర‌వ‌డికి శ్రీ‌కారం చుట్టింది.

అయితే ఈ మూవీ తెలుగు వెర్ష‌‌న్ చేసే అవ‌కాశం మెగాస్టార్ చిరంజీవికి వ‌చ్చింద‌ట‌. `గ్యాంగ్‌లీడ‌ర్` హిట్ త‌రువాత మెగాస్టార్ చిరంజీవి మాంచి స్పీడుమీదున్నారు. ఇదే స‌మ‌యంలో ఓ మూవీ షూటింగ్ కోసం చెన్నైలో వుండ‌గా ద‌ర్శ‌కుడు సురేష్‌కృష్ణ `బాషా` క‌థ‌ని చిరుకు వినిపించార‌ట‌. తెలుగులో ఈ క‌థ‌ని మీరు `బిగ్‌బాస్‌` పేరుతో చేస్తే బాగుంటుంద‌ని సూచించార‌ట‌. క‌థ న‌చ్చ‌డంతో దీని తెలుగు వెర్ష‌న్ రైట్స్‌ని తీసుకోమ‌ని అల్లు అర‌వింద్‌కు చెప్పార‌ట‌.

- Advertisement -

అయితే తెలుగు రైట్స్‌కు 40 ల‌క్ష‌లు డిమాండ్ చేయ‌డం.. అందుకు అల్లు అర‌వింద్ అంగీక‌రించ‌పోవ‌డంతో ఆ ప్రాజెక్ట్ కార్య‌రూపం దాల్చ‌లేద‌ని, ర‌జ‌నీకి తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వుండ‌టంతో అదే చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో డ‌బ్ చేయ‌డం.. అది బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కావ‌డం తెలిసిందే. 1995లో విడుద‌లైన `బాషా` తెలుగు, త‌మిళ భాష‌ల్లో సంచ‌ల‌న విజ‌యం సాధించి ర‌జ‌నీకి తిరుగులేని ఇమేజ్‌ని తెచ్చిపెట్టింది. ఇంత‌టి ఎవ‌ర్‌గ్రీన్ మూవీని చిరు వ‌దులుకోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం అల్లు అర‌వింద్ అని తెలిసింది. తాజాగా ఈ విష‌యం బ‌య‌టికి రావ‌డంతో ఫ్యాన్స్ అల్లు వారు ఎంత ప‌ని చేశార‌ని ఆశ్చ‌ర్యానికి లోన‌వుతున్న‌రట‌.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All