Saturday, October 1, 2022
Homeటాప్ స్టోరీస్బిగ్ బాస్ గెలిచినోళ్ళు బాగుపడలేదు ఎందుకు...?

బిగ్ బాస్ గెలిచినోళ్ళు బాగుపడలేదు ఎందుకు…?

Why Biggboss Winners not well settled ?
Why Biggboss Winners not well settled ?

యుద్ధం లో గెలిచి రాజ్యం ఏలదాం అని అనుకుంటే, చచ్చిన వాళ్ళకు పిండాలు  ఎవడు పెడతాడు.? అని వెనకటికి ఒక అద్భుతమైన సామెత ఉంది. కొంచెం అటు ఇటు గా మార్చి బిగ్ బాస్ తెలుగు సీజన్ విన్నర్ లకు ఇది వర్తించేలా ఉంది . అది ఎలాగో తెలియాలంటే దయచేసి పూర్తిగా చదవండి

- Advertisement -

వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో అని ఊరికే డబ్బాలు కొట్టుకునే బిగ్ బాస్ షో మరియు అందులో  భాగంగా హౌస్ లోకి వచ్చి కిందా మీద పడి ఏదో సాధించాలని పిలుచుకునే హౌస్ మేట్ల పరిస్థితి పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా తయారైంది.

అసలు మేటర్ లోకి వస్తే బిగ్ బాస్ సీజన్ వన్ విజేతగా నటుడు శివ బాలాజీ గెలిచారు బిగ్ బాస్ సీజన్  లో పార్టీస్పేట్ చేయక ముందు వరకు కూడా  మనోడికి ఏమీ బీభత్సమైన మార్కెట్ లేదు.  చివరకు ఆదర్శ్ గట్టిపోటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అండ్ తో శివ బాలాజీ టైటిల్ గెలిచాడు.  గెలిచిన తర్వాత అయినా గాని శివబాలాజీ పొజిషన్ ఏమైనా బెటర్ అయిందా అంటే, అదీ లేదు.

కాటమరాయుడు సినిమా లో పవన్ కళ్యాణ్ తమ్ముడు పాత్ర తప్ప ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ సినిమాలో చెప్పుకోదగ్గ పాత్ర శివ బాలాజీ కి లభించలేదు.  మొత్తంగా చూస్తే బిగ్ బాస్  టైటిల్ గెలిచినందుకు శివ బాలాజీ కి ప్రైజ్ మనీ తప్ప కొత్తగా ఏమీ కలిసి రాలేదు.

ఇక సీజన్ 2 విజేత కౌశల్ విషయానికి వస్తే సీజన్ కొనసాగినంత  కాలం, ఓటింగ్ కౌశల్ కి ఏకపక్షంగా సాగింది.  అన్ని రకాలుగా పక్కా ప్లానింగ్ తో వెళ్లిన కౌశల్ చివరికి సీజన్ 2 టైటిల్ గెలిచాడు.  తరువాత కౌశల్ సోలో హీరోగా సినిమాలు చేస్తాడు.. అంటూ ప్రసారమాధ్యమాలు,  కౌశల్ ఆర్మీ తెగ హడావిడి చేశారు.  ఏదో ఒకటి రెండు షాపింగ్ మాల్స్ ఓపెనింగులు తప్ప  కౌశల్ కి పెద్ద కలిసి వచ్చింది ఏమీ లేదు.  తన భార్య అనారోగ్య కారణంతో తన వృత్తి పరంగా తీసుకున్నానని కౌషల్ చెబుతున్నా,  బిగ్ బాస్ సీజన్ 2 టైటిల్ గెలవడం వల్ల,  కౌశల్ ఆర్మీ అనే ఒక ఫ్యాన్స్ గ్రూప్ ఏర్పడటం వల్ల అతనికి ఏ మాత్రం ఉపయోగం  కలగలేదు.

ఇక రీసెంట్ గా జరిగిన బిగ్ బాస్ సీజన్ 3 విషయానికి వస్తే శ్రీముఖి అండ్ టీం పక్కా ప్లానింగ్ తో ఆమే టైటిల్ ని గెలుస్తుంది అంటూ ఊదరగొట్టారు.  కానీ రాహుల్ సిప్లిగంజ్ టైటిల్ గెలుచుకున్నాడు.

రాహుల్ సిప్లిగంజ్ మొదటి నుండే సినిమా లలో పాటలు పాడి ఎస్టాబ్లిష్ అయిన సింగర్.  ఇక ఫైనలిస్టు శ్రీముఖి విషయానికి వస్తే బిగ్ బాస్ లో ఆడినంత మాత్రాన ఆమెకు తన కెరియర్ లో next చిన్న సినిమాల హీరోయిన్ గా అవకాశం వస్తుంది అనుకుంటే పొరపాటే. యాంకరింగ్ పరంగా కూడా ఆమెకు ప్రత్యామ్నాయంగా ఎంతోమంది ఆమె చేసిన కార్యక్రమాల్లో కనిపిస్తున్నారు.

ఈ మాత్రం దానికి గెలిచిన గెలవకపోయినా 100  – 150 రోజులపాటు ఆంక్షలు అగ్రిమెంట్లు బాండ్లు గోల. మళ్లీ  హౌస్ లో ఆడించేది చిల్లర ఆటలు.  కోట్లు ఖర్చు పెట్టి ఆడే ఈ కార్పొరేట్ వికృత క్రీడ చూసే  ప్రేక్షకులకు ఏమాత్రం ఉపయోగం లేదు,  కనీసం ఆశలు పెట్టుకొని ఆడే వాళ్లకి కూడా ఏమాత్రం పనికి రాదని, కలిసి రాదని తేలిపోయింది

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts