Homeటాప్ స్టోరీస్బాలయ్య కావాలనే సంక్రాంతిని మిస్ చేశాడా?

బాలయ్య కావాలనే సంక్రాంతిని మిస్ చేశాడా?

బాలయ్య కావాలనే సంక్రాంతిని మిస్ చేశాడా?
బాలయ్య కావాలనే సంక్రాంతిని మిస్ చేశాడా?

నందమూరి బాలకృష్ణకు సంక్రాంతి హీరో అని పేరుంది. తెలుగు ఇండస్ట్రీలో అత్యధికంగా తన సినిమాలను సంక్రాంతికి విడుదల చేసిన బాలయ్య ఈసారి సారి మాత్రం సీజన్ ను మిస్ అయ్యాడు. బాలకృష్ణ ప్రస్తుతం కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా ఫినిషింగ్ స్టేజెస్ లో ఉంది. దాంతో సంక్రాంతికి మరోసారి బాలయ్య రానున్నాడని ప్రచారం జరిగింది.

అయితే రీసెంట్ గా బాలయ్య సంక్రాంతి ట్రాక్ రికార్డ్ ఏం బాలేదు. డిక్టేటర్, ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలు దారుణంగా బోల్తాకొట్టాయి. జైసింహా జస్ట్ లో సేఫ్ అయింది. ఇలా వరసగా తన సంక్రాంతి సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో బాలయ్య ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. అలాగే ఈ సంక్రాంతికి ఇద్దరు టాప్ హీరోలు తమ సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. దీంతో పోటీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తన సినిమాను క్రిస్మస్ కు కానీ సంక్రాంతి తర్వాత కానీ విడుదల చేయాలని భావిస్తున్నాడు. మరి ఇది సరైన నిర్ణయమో కాదో కాలమే నిర్ణయిస్తుంది.

- Advertisement -

ఈ చిత్రంలో సోనాల్ చౌహన్, వేదిక హీరోయిన్లుగా నటిస్తుండగా, భూమిక కీలక పాత్రలో కనిపిస్తోంది. చిరంతన్ భట్ సంగీత దర్శకుడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All