Homeగాసిప్స్పవన్ తో పోటీకి సై అనేదెవరు?

పవన్ తో పోటీకి సై అనేదెవరు?

పవన్ తో పోటీకి సై అనేదెవరు?
పవన్ తో పోటీకి సై అనేదెవరు?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేసాడు. ఇప్పటికే పింక్ రీమేక్ లో చురుగ్గా పాల్గొంటున్నాడు. ఈ విషయంలో పవన్ అభిమానులు సూపర్ హ్యాపీగా ఉన్నారు. పవన్ రీ ఎంట్రీని స్వాగతిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మొదలైన కొన్ని రోజులకే పవన్ మరో కొత్త సినిమాను మొదలుపెట్టేశాడు. క్రిష్ దర్శకత్వంలో కొత్త సినిమా మొన్నే ప్రారంభోత్సవం జరుపుకుంది. అయితే ఈ విషయాన్ని మీడియాతో సహా ఎక్కడా రాకుండా జాగ్రత్త పడ్డారు. ఈ సినిమా క్లాప్ బోర్డు ఫోటో ఒకటి బయటపడడం వల్ల ఈ విషయాన్ని నిర్దారించుకోవచ్చు.

ఎందుకనో పవన్ ఈ రెండు సినిమాలకు కూడా హడావుడిని కోరుకోలేదు. మీడియాకు ప్రెస్ నోట్ కూడా విడుదల చేయలేదు. కామ్ గా షూటింగ్ మొదలుపెట్టేశాడు. క్రిష్ సినిమాను కూడా ఎలాంటి హడావిడి లేకుండా ఫిబ్రవరి మొదటి వారంలోనే షూటింగ్ ను స్టార్ట్ చేసేస్తాడు. ఈ చిత్రాన్ని 2021 సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ విషయాన్నే దాదాపు కన్ఫర్మ్ చేసుకోవచ్చని క్లోజ్ సోర్సెస్ చెబుతున్నాయి. అంటే వచ్చే సంక్రాంతికి విడుదల షెడ్యూల్ అయిన మొదటి చిత్రంగా పవన్ – క్రిష్ ప్రాజెక్ట్ అనుకోవచ్చు.

- Advertisement -

ఈ సంక్రాంతికి అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఢీకొన్నాయి. ఈ రెండు సినిమాలు దేనికవే బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన నేపథ్యంలో వచ్చే సంక్రాంతికి ఏ ఏ సినిమాలు షెడ్యూల్ కానున్నాయనేది ఆసక్తికరంగా మారింది. పవన్ తో ఢీకొనే అవకాశాలు ఎవరికెవరికి ఉన్నాయో అని ఇప్పటి నుండి చర్చించుకుంటున్నారు. అది మహేష్ – వంశీ పైడిపల్లి చిత్రమవుతుందా లేక ఎన్టీఆర్ – త్రివిక్రమ్ ప్రాజెక్ట్ అవుతుందా లేక బన్నీ – సుకుమార్ ది అవుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ఎంత సంక్రాంతి సీజన్ అయినా కూడా రెండుకు మించి సినిమాలను ఈ సీజన్ హోల్డ్ చేయలేదు. అందుకే పవన్ ను ఢీకొట్టే హీరో ఎవరా అని చర్చించుకుంటున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All