పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇక సినిమాల్లో నటించనని ,ఇక మీదట జనసేన వ్యవహారాలు మాత్రమే చూస్తానని స్పష్టం చేయడంతో టాలీవుడ్ నెంబర్ వన్ హీరో ఎవరన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది . నిన్న మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ – మహేష్ బాబు లు హోరా హోరీగా పోరాడారు అయితే పవన్ కళ్యాణ్ రేసు నుండి తప్పుకోగా మహేష్ బాబు భారీ డిజాస్టర్ లతో కెరీర్ లో తిరోగమన దిశగా సాగుతున్నాడు . బ్రహ్మోత్సవం , స్పైడర్ చిత్రాలు బయ్యర్ల ని , ఎగ్జి బిటర్ల ని దారుణంగా దెబ్బకొట్టాయి దాంతో మహేష్ సినిమా అంటే భయపడిపోతున్నారు .
అయితే అదే సమయంలో ఎన్టీఆర్ మాత్రం గత మూడేళ్ళుగా హిట్స్ కొడుతూనే ఉన్నాడు . భారీ హిట్స్ కొట్టక పోయినప్పటికీ విజయాలను మాత్రం అందుకుంటూనే ఉన్నాడు అయితే జై లవకుశ అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాలేకపోయింది . టెంపర్ , నాన్నకు ప్రేమతో , జనతా గ్యారేజ్ చిత్రాలతో వరుస విజయాలు అందుకున్నాడు ఎన్టీఆర్ . పవన్ కళ్యాణ్ రేసు నుండి తప్పుకోవడంతో ఇప్పుడు ఎన్టీఆర్ – మహేష్ బాబు ల మధ్య నెంబర్ పీఠం దోబూచులాడనుంది .