Homeటాప్ స్టోరీస్రాజమౌళి తదుపరి సినిమా ఏ హీరోతో ?

రాజమౌళి తదుపరి సినిమా ఏ హీరోతో ?

Who is Rajamouli next hero ? Rajini or Mahesh ?ఓటమి ఎరుగని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తాజాగా ఎన్టీఆర్చరణ్ లతో ఆర్ ఆర్ ఆర్ వంటి భారీ ప్రతిష్టాత్మక చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే . ఆ సినిమా 2020 లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . కాగా ఆ సినిమా తర్వాత రాజమౌళి తదుపరి సినిమా ఏ హీరో తో అన్నది ప్రశ్నగా మారింది . మహేష్ బాబు తో ఒక సినిమా చేయాలనీ ఎప్పటినుండో అనుకుంటున్నాడు రాజమౌళి , అలాగే రజనీకాంత్ తో కూడా సినిమా చేయాలనీ ఆశపడుతున్నాడు జక్కన్న .

అయితే ఈ ఇద్దరు హీరోలలో ఎవరితో రాజమౌళి సినిమా చేయనున్నాడు అన్నది ఆసక్తికరంగా మారింది . రజనీకాంత్ తాజాగా పేట చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు ఆ సినిమా తర్వాత మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు . అలాగే మహేష్ బాబు మహర్షి సినిమా చేస్తున్నాడు దాని తర్వాత సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు . అది పూర్తయ్యాక రాజమౌళి తో ఉంటుందా ? లేదా ? తెలియాలి . అలాగే రాజమౌళి రజనీకాంత్ , మహేష్ బాబు లలో ఎవరితో సినిమా చేస్తాడో అన్న ఆసక్తి నెలకొంది .

- Advertisement -

English Title: Who is Rajamouli next hero ? Rajini or Mahesh ?

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All