Homeటాప్ స్టోరీస్విజిల్ వీకెండ్ కలెక్షన్స్ ౼ డీసెంట్

విజిల్ వీకెండ్ కలెక్షన్స్ ౼ డీసెంట్

విజిల్ వీకెండ్ కలెక్షన్స్ ౼ డీసెంట్
విజిల్ వీకెండ్ కలెక్షన్స్ ౼ డీసెంట్

ఇప్పటిదాకా తెలుగులో నిఖార్సయిన హిట్ లేని తమిళ సూపర్ స్టార్ విజయ్ ఇప్పుడు విజిల్ చిత్రంతో సూపర్ హిట్ సాధించేలా కనిపిస్తున్నాడు. విజయ్ చిత్రాలు గతంలో చాలా విడుదలయ్యాయి. శంకర్ దర్శకత్వంలో వచ్చిన స్నేహితుడు ప్లాప్ అవ్వగా, తుపాకీ కంటెంట్ బాగున్నా కానీ ఓ మాదిరిగా ఆడింది. పోలిసోడు, అదిరింది సినిమాలు కూడా స్వల్ప నష్టాలతో బయటపడ్డాయి. అయితే విజయ్ కు తెలుగు మార్కెట్ లో ఈ సినిమాల ద్వారా గుర్తింపయితే వచ్చింది. అందుకే విజయ్ లేటెస్ట్ సినిమా బిగిల్ కు తెలుగులో భారీ బిజినెస్ జరిగింది. విజిల్ పేరుతో తెలుగులోకి అనువాదమైన ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాలలో దాదాపు 10.5 కోట్ల బిజినెస్ జరిగింది. ఇక్కడి విజయ్ రేంజ్ కు ఇది పెద్ద మొత్తమే. రజినీకాంత్, కమల్ హాసన్ వంటి సీజన్డ్ నటులను పక్కన పెడితే సూర్య సినిమాలు మాత్రమే తెలుగులో పది కోట్ల మేర బిజినెస్ జరిగేవి. ఇప్పుడు సూర్య మార్కెట్ కూడా పూర్తిగా డౌన్ అయిపోయింది అది వేరే విషయం లెండి. ఈ నేపథ్యంలో విజయ్ విజిల్ కు ఇక్కడ పదిన్నర కోట్ల రూపాయల బిజినెస్ అంటే ఇక్కడి డిస్ట్రిబ్యూటర్ రిస్క్ చేస్తున్నాడేమో అనుకున్నారంతా.

అయితే దీపావళి పండక్కి విడుదలైన విజిల్ చిత్రం ఇక్కడ తన హవా చాటుకుంది. నిజానికి ఈ సినిమాకు ఇక్కడి క్రిటిక్స్ తక్కువ రేటింగ్స్ ఇచ్చారు. కేవలం విజయ్ ఫ్యాన్స్ కోసమే తీసిన చిత్రంగా దీన్ని అభివర్ణించారు. మిగిలిన వారికి ఈ చిత్రం బోర్ కొట్టిస్తుందని, కొంచెం ఓవర్ గా కూడా అనిపిస్తుంది అన్నారు. అయితే విజిల్ ఈ విమర్శలు అన్నిటినీ దాటుకుని బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. పదిన్నర కోట్లకు బిజినెస్ జరిగిన ఈ చిత్రం వీకెండ్ ముగిసేనాటికి ఆరున్నర కోట్లు వసూలు చేసి విమర్శకుల నోళ్లు మూయించింది. ఇప్పటికే 65 శాతానికి మించి వసూళ్లు రాబట్టడంతో ఇక విజిల్ ఇక్కడ బ్రేక్ ఈవెన్ కు చేరుకోవడం నల్లేరు మీద నడకనే చెప్పాలి. ఎట్టకేలకు విజయ్ విజిల్ ద్వారా తెలుగులో నిఖార్సయిన హిట్ కొట్టబోతున్నాడు.

- Advertisement -

తొలి రోజు 2.6 కోట్ల షేర్ రాబట్టిన విజిల్, రెండో రోజు కూడా తొలిరోజు మాదిరి వసూలు చేయడంతో తొలి వీకెండ్ కే ఆరున్నర కోట్లు వచ్చేసాయి. మరో 4 కోట్లు వసూలు చేయగలిగితే విజిల్ ఇక్కడ హిట్ అవ్వడం ఖాయం. దీపావళి కూడా ముగియడంతో సోమవారం నుండి ఈ చిత్రం ఎలా ఆడుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. వీక్ డేస్ కూడా కన్సిస్టెంట్ గా ఉంటే విజిల్ రేంజ్ మరింత పెరుగుతుంది అనడంలో సందేహం లేదు.

విజిల్ రెండు తెలుగు రాష్ట్రాల వీకెండ్ కలెక్షన్స్ బ్రేక్ డౌన్

నైజాం 1.92

సీడెడ్ 1.65

నెల్లూరు 0.27

కృష్ణ 0.44

గుంటూరు 0.81

వైజాగ్ 0.67

ఈస్ట్ గోదావరి 0.45

వెస్ట్ గోదావరి 0.29

మొత్తం 6.50

మరోవైపు విజిల్ కు పోటీగా విడుదలైన ఖైదీ కూడా హిట్ టాక్ తెచ్చుకుని దూసుకుపోతుండడం విశేషం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All