
మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు “జెమినీ గణేషన్” పాత్రలో పరిచయమైన నటుడు దుల్కర్ సల్మాన్. మణి రత్నం సర్ తీసిన మరొక సూపర్ హిట్ సినిమా “ఓకే కన్మణి” తో సహా ఎన్నో హిట్ సినిమాలు చేసారు ఆయన. విభిన్నమైన కథలు ఎంచుకుంటూ, నెమ్మదిగా పాన్ ఇండియా స్థాయి సినిమాలు చేస్తున్నరాయన.
ఇక, నవీన్ గౌడ్ అనే పేరుతో ఇండస్ట్రీ కి వచ్చి, మొదట సీరియల్స్ చేసి, తరువాత సినిమాలు చేస్తూ, హిట్ లు అందుకుంటూ, ఒక్క సినిమాతో యావత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ని తనవైపు చూసేలా చేసుకున్న నటుడు “రాకింగ్ స్టార్ యష్.” ఇప్పుడు యష్ అంటే అక్కడ కేవలం ఒక స్టార్ కాదు. ఒక బ్రాండ్. ఉపేంద్ర సర్ తరువాత యావత్ సౌత్ ఇండియా స్థాయిలో కల్ట్ ఫ్యాన్స్ బిల్డ్ అయ్యారు యష్ కి.
ఇప్పుడు ఈ ఇద్దరు స్టార్స్ కలిసి దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జిమ్ లో కలుసుకున్నట్లు కనపడుతున్న ఈ ఇద్దరు సూపర్ స్టార్స్ చిరునవ్వు చూస్తుంటే, తొందరలో ఇద్దరూ కలిసి కాంబినేషన్ లో మూవీ చేస్తున్నట్లు అనిపిస్తోంది. ఇక యష్ గురించి దుల్కర్..; దుల్కర్ గురించి యష్ ఎంతో స్నేహపూర్వకమైన సంగతులు షేర్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం దుల్కర్ తన “కురుప్” సినిమా షూటింగ్ కోసం బెంగళూరు వచ్చారు. అయితే యష్ KGF 2 సినిమా షూటింగ్ కూడా అక్కడకి దగ్గరలోనే జరుగుతూ ఉండటం గమనార్హం.