Homeటాప్ స్టోరీస్హరీష్ రావు రాజీనామా : అసలేం జరుగుతోంది

హరీష్ రావు రాజీనామా : అసలేం జరుగుతోంది

Whats cooking in TRSమాజీ మంత్రి , సిద్ధిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు నిన్న సాయంత్రం తెలంగాణ మజ్దూర్ యూనియన్ గౌరవ అధ్యక్ష పదవికి రాజీనామా చేసాడు , ఇక ఈరోజు బంజారాహిల్స్ లో మినిస్టర్స్ క్వార్టర్స్ నుండి ఖాళీ చేసాడు దాంతో సంచలనమే అయ్యింది తెలంగాణలో . అసలు ఏం జరుగుతోంది అన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలయ్యింది . ఒకవైపు కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాడు కానీ హరీష్ రావు మాత్రం ఒక యూనియన్ గౌరవ అధ్యక్ష స్థానం నుండి తప్పుకోవడమే కాకుండా ఏకంగా మంత్రి బంగ్లా నుండి కూడా ఖాళీ అయ్యాడు .

త్వరలో జరుగనున్న మంత్రివర్గం లో హరీష్ రావు కు మంత్రి పదవి రాకపోవచ్చునని అందుకే ఖాళీ చేసాడని గుసగుసలు వినిపిస్తున్నాయి . అలాగే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో హరీష్ రావు లోక్ సభకు పోటీ చేయనున్నాడు కాబట్టి ఖాళీ చేసాడని అంటున్నారు . ఏది ఏమైనా అధికార తెలంగాణ రాష్ట్ర సమితి లో మాత్రం నివురు గప్పిన నిప్పులా పరిస్థితి ఉందని మాత్రం అర్ధం అవుతోంది .

- Advertisement -

English Title: Whats cooking in TRS

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All