Homeఎక్స్ క్లూసివ్హరీష్ రావు ఏం చేయబోతున్నాడు

హరీష్ రావు ఏం చేయబోతున్నాడు

What' s the meaning of Harish rao silenceతెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తున ఎగిసిపడిన కెరటం తన్నీరు హరీష్ రావు . తెలంగాణ సాకారం అయ్యాక కేసీఆర్ మంత్రివర్గంలో కీలకమైన శాఖని నిర్వహించాడు . అయితే అదంతా గతం , తెలంగాణ లో మళ్లీ ఎన్నికలు జరిగాయి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసాడు . ఇక ఈరోజు మంత్రివర్గ విస్తరణ కూడా ఉంది కానీ హరీష్ రావు కు మాత్రం మంత్రి పదవి లభించలేదు . దానికి తోడు కేటీఆర్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి లభించింది కానీ హరీష్ పాత్రని మరింతగా తగ్గిస్తూ వచ్చారు .

 

- Advertisement -

 

ఇక ఇప్పుడేమో హరీష్ ని పార్లమెంట్ కు పంపే ఆలోచన చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి . దాంతో హరీష్ రావు పార్లమెంట్ కు వెళ్తాడా ? లేక ఎదురు తిరిగుతాడా ? అన్న చర్చ జరుగుతోంది . తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ నేపథ్యంలో ఏ నలుగురూ మాట్లాడుతున్నా హరీష్ రావు గురించే చర్చ సాగుతోంది . అయితే హరీష్ రావు మాత్రం ఇప్పటివరకు నోరు విప్పలేదు . కేసీఆర్ చెప్పినట్లుగా నడుచుకుంటాడా ? లేక ఎదురు తిరుగుతాడా ? ఇదే చర్చ జరుగుతోంది . రాబోయే రోజుల్లో తెలంగాణ లో ఏం జరగబోతోంది అన్న ఆసక్తి నెలకొంది .

English Title: What’ s the meaning of Harish rao silence

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All