Homeన్యూస్రవితేజ ఏం వెతుకుతున్నట్టు..?

రవితేజ ఏం వెతుకుతున్నట్టు..?

రవితేజ ఏం వెతుకుతున్నట్టు..?
రవితేజ ఏం వెతుకుతున్నట్టు..?

క్రాక్ తో గత ఏడాది సూపర్ హిట్ అందుకున్న మాస్ మహారాజా రవితేజ రీసెంట్ గా ఖిలాడీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ ప్లాప్ అందుకున్నాడు. గతంలో తనకు ప్లాప్ ఇచ్చిన డైరెక్టర్ రమేష్ వర్మ ను నమ్ముకొని చేసిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచింది. మీనాక్షి, డింపుల్ , అనసూయ వంటి వారు అందాల ఆరబోత చేసినప్పటికీ యూత్ కు మాత్రం కిక్ ఇవ్వలేకపోయింది. ఈ సినిమా టాక్ నుండి బయటపడ్డ రవితేజ ఇతర సినిమాల షూటింగ్ లలో బిజీ గా ఉన్నారు. ప్రస్తుతం రవితేజ మూడు సినిమాలను సెట్స్ పైన ఉంచాడు. వాటిలో ధమాకా మూవీ ఒకటి.

నేను లోకల్ ఫేమ్ త్రినాథరావు నక్కిన డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ లపై అభిషేక్ అగర్వాల్ టీ.జి. విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. సెట్ లో షూటింగ్ కి బ్రేక్ దొరకడం తో రవితేజ ప్రత్యేకంగా వేసిన చైర్ లో కూర్చుని కనిపించారు.

- Advertisement -

ఇదే ఫొటోని సోషల్ మీడియా ఇన్ స్టా గ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఇంతకీ ఈ ఫొటోలో రవితేజ ఏంచేస్తున్నాడు? .. చేతిలో వుందేంటీ? అని ఆరా తీస్తే .. రవితేజ షాట్ గ్యాప్ లో తన స్మార్ట్ ఫోన్ లో ఏదో వెతుకుతున్నట్టుగా కనిపించారు. మరి దేనికోసం అంతగా వెతుకుతున్నారో అర్ధం కావడం లేదు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.

 

View this post on Instagram

 

A post shared by RAVI TEJA (@raviteja_2628)

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All