
ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా తమిళ దర్శకుడు లింగుసామి డైరక్షన్ లో ఒక సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఉప్పెన భామ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా కోసం రామ్ చాలా కష్టపడుతున్నాడని తెలుస్తుంది. ఇక లేటెస్ట్ గా రామ్ తన సోషల్ మీడియా ఎకౌంట్ లో మెడకు పట్టి పెట్టుకున్న పిక్ షేర్ చేశాడు. అది చూసి రామ్ కు ఏమైందని ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు.
ఒకవేళ షూటింగ్ లో ఏదైనా గాయాలు అయ్యాయా.. లేదా రామ్ కు మెడ భాగం ఏమైనా పట్టేసిందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మెడకు పట్టి ఉన్న పిక్ ను సోషల్ మీడియాలో షేర్ చేసిన రామ్. టేక్ ఏ బ్రేక్.. లేదా టేక్ ది బ్రేక్ అంటూ కామెంట్ పెట్టాడు. మొత్తానికి రామ్ షూటింగ్ కు బ్రేక్ వచ్చింది.
రామ్, లింగుసామి కాంబోలో వస్తున్న ఈ సినిమాలో రామ్ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపిస్తారని తెలుస్తుంది. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్, రెడ్ సినిమాలతో హిట్లు కొట్టిన రామ్ ఈ సినిమాతో హ్యాట్రిక్ షురూ చేయాలని చూస్తున్నాడు.